డాక్టర్లు చాలాసార్లు అరుదైన సర్జరీలు చేయడం సర్వసాధారణం. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా అలాంటిదే. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రైవేటు పార్టులో నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికొచ్చింది. తీరా డాక్టర్లు ఆమెకు కొన్ని పరీక్షలు చేసి.. ఎక్స్‌రే తీయగా.. అక్కడ కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆ యువతి ప్రైవేటు పార్టులోకి చొచ్చుకుపోయింది ఓ బులెట్. ఇక దాన్ని అరుదైన ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు డాక్టర్లు. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
వివరాల్లోకి వెళ్తే.. సోమాలియాలోకి చెందిన 24 ఏళ్ల యువతి తన గదిలో కూర్చుని ఉండగా ఓ బులెట్ సీలింగ్ నుంచి వచ్చి సరాసరి తన ప్రైవేటు పార్టులోకి చొచ్చుకుపోయిందట. ఆ ఘటన అనంతరం ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఎర్డోగన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా సుమారు రెండు సెంటీమీటర్ల బులెట్ ఆమె ప్రైవేట్ పార్టులోకి చొచ్చుకుపోయినట్లు నిర్ధారించారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.
అందులో పేర్కొన్న ఓ కథనం ప్రకారం.. ‘స్త్రీ జననేంద్రియాల బయటి భాగంలోకి చొచ్చుకుపోయిన మొదటి బులెట్ గాయం ఇదే. ఇవి చాలా అరుదుగా జరుగుతుంది. ఆమెకు అనస్థీషియా ఇచ్చి ప్రైవేట్ పార్ట్‌లో నుంచి బులెట్‌ను బయటకు తీశారు వైద్యులు. బులెట్ తక్కువ వేగంతో మహిళకు తగిలిందని, లేకుంటే ఆమెకు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉండేదని వైద్యులు అన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ మహిళ మరుసటి రోజే ఆరోగ్యవంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. సుమారు నెల పాటు ఆమెను పర్యవేక్షించామని.. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి సమస్యలు రాలేదని’ డాక్టర్లు జర్నల్‌లో పేర్కొన్నారు.
కాగా, యుద్ధం జరుగుతోన్న దేశాల్లో.. ఆకాశంలోకి తూటాలను పేల్చినప్పుడు.. అవి వాటి శక్తిని కోల్పోయి నేలపైకి పడిపోతాయి. ఆ సమయంలోనే ఇలాంటి గాయాలు సంభవిస్తాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగా “సోమాలియా లాంటి యుద్ద వాతావరణం నెలకొన్న దేశాల్లోని నివాస ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి”