Catwalk: నడిరోడ్డుపై మహిళలు, చిన్నారుల క్యాట్ వాక్.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Women catwalk on roads: దేశంలో కనిపించే ప్రధాన సమస్యల్లో రహదారులు ఒకటి.. ఈ సమస్యను ప్రతిఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. అసలే అంతంతమాత్రం రోడ్డు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు

Catwalk: నడిరోడ్డుపై మహిళలు, చిన్నారుల క్యాట్ వాక్.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Women Catwalk On Roads

Updated on: Sep 07, 2021 | 7:21 AM

Women catwalk on roads: దేశంలో కనిపించే ప్రధాన సమస్యల్లో రహదారులు ఒకటి.. ఈ సమస్యను ప్రతిఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. అసలే అంతంతమాత్రం రోడ్డు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడితే పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. కొన్నిప్రాంతాల్లో కనీసం నడవడానికి కూడా అవస్థలు పడక తప్పదు. ఇలాంటి పరిస్థితులు మనచుట్టూ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. దీంతో అందరూ చేసేదేంలేక చూసి చూడినట్టు వదిలేస్తుంటారు. ఎప్పుడో రాజకీయ నాయకులు, అధికారులు కనిపించినప్పుడు.. తమ బాధలను చెప్పుకుని మిన్నకుంటారు. అయితే.. తమ ప్రాంతంలోని అధ్వానంగా ఉన్న రోడ్లను చూసి చిర్రెత్తుకొచ్చిన కొంతమంది మహిళలు, పిల్లలు మాత్రం ఈ సమస్యపై పోరడటానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమ సమస్యను పట్టించుకోవాలంటూ గుంతలు ఉన్న రోడ్లపై క్యాట్ వాక్ చేసి.. వార్తల్లో నిలిచారు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌ డానిష్ నగర్‌లో చోటుచేసుకుంది. అధ్వానంగా ఉన్న రోడ్లను పట్టించుకోవాలంటూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు, పిల్లలు రోడ్లపైన క్యాట్ వాక్ చేశారు. డానిష్ నగర్‌ భోపాల్‌లోని ఒక సిటీ. ఆ ప్రాంతంలో అధిక ధరలు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేసి నివాసముంటున్నప్పటికీ.. తమ సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళలు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై స్పందించకపోతే ఎలా అంటూ పేర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. ఓటు వేయమంటూ ఈవెంట్ ఆర్గనైజర్ అన్షు గుప్తా పేర్కొన్నారు.

వీడియో..

ప్రస్తుతం ఈ క్యాట్‌వాక్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ క్యాట్‌వాక్‌ల్‌ మహిళలు, చిన్నారులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. కాగా.. 2017లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రకటనలను, ప్లకార్డులు పట్టుకుని మహిళలు క్యాట్‌వాక్‌ చేశారు. ఆ ప్లకార్డుల్లో మధ్యప్రదేశ్‌లోని రోడ్లు యునైటెడ్ స్టేట్స్ కంటే మెరుగ్గా ఉన్నాయంటూ.. శివరాజ్‌ సింగ్‌ చేసిన కామెంట్స్‌ ఉన్నాయి. మహిళల నిరసన అనంతరం అధికారులు స్పందించారు. రోడ్ల పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ పేర్కొన్నారు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Government of India: శుభవార్త.. దీపావళికి ముందు వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..