Covid Vaccine Lottery: కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. అదృష్టం వరించింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది..

|

Nov 09, 2021 | 1:58 PM

Million Dollar Vax lottery: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి

Covid Vaccine Lottery: కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. అదృష్టం వరించింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది..
Lottery
Follow us on

Million Dollar Vax lottery: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి కాపాడేందుకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం.. టీకా తీసుకునేందుకు చాలామంది వెనకడుగువేశారు. సందేహాలపై క్లారిటి రావడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. కొంతమంది అసలు వ్యాక్సిన్ అంటేనే ఇంకా భయపడుతుంటే.. మరికొందరు వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా నిర్వహించేందుకు పలు దేశాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంటే.. ఆహార పదార్థాలను, నిత్యవసర వస్తువులను, నగదు బహుమతులు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ ఆఫర్‌లో భాగంగా కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న ఓ యువతి రాత్రికి రాత్రే కోటిశ్వురాలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునే వారి కోసం ఈ లాటరీని ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న 25 ఏళ్ల జోవాన్ ఝూ ఆస్ట్రేలియా మిలియన్ డాలర్ల లాటరీను పొందింది. రోజువారీ కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వంతోపాటు కొన్ని ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఈ లాటరీని నిర్వహించారు.

లక్షలాది మందిలో పాల్గొన్న ఈ లాటరీలో జోవాన్ ఝూ ఒక్కతే ఓవర్‌నైట్ మిలియనీర్ అయ్యింది. ఆమె వ్యాక్సిన్ లాటరీలో లక్ష ఆస్ట్రేలియా డాలర్లను పొందింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5.4 కోట్లు గెలుచుకుంది. ది మిలియన్ డాలర్ వాక్స్ ఏలియన్స్ లాటరీని సొంతం చేసుకున్న జూ మాట్లాడుతూ.. తానకు ఈ లాటరీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఫోన్ వచ్చినప్పుడు నమ్మలేదని.. ఆతర్వాత నమ్మానంటూ వెల్లడించింది. ఈ లాటరీతో కష్టాలు తీరుతాయంటూ తెలిపింది.

కాగా.. అక్టోబర్ నెలలో లాటరీ ప్రారంభించినప్పుడు మిలియన్ డాలర్ వ్యాక్స్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. లాటరీ ప్రకటించిన 24 గంటల్లో 350,000 మంది వ్యాక్సిన్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ ఆస్ట్రేలియన్ లాటరీలో 3,100 మందికి పైగా 4.1 మిలియన్ల విలువైన బహుమతులు అందజేశారు.

Also Read:

Lakhimpur Violence: ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక ఆదారాలు.. లఖీంపూర్‌ ఖేరి ఘటనలో మంత్రి కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు..

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలు