Viral Video: కరోనా వైరస్ ప్రభావంతో గతేడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. దాంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అప్పర్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు జరిగాయి. అదే వేరే విషయం. అయితే, చిన్న పిల్లలు తమ స్కూల్‌ని, చదువులను పూర్తిగా మర్చిపోయారనే చెప్పాలి. ఏడాది కాలంగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు, కాలేజీలు వరుసగా తెరుచుకుంటున్నాయి. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఇంతకాలం ఇంటి వద్ద సరదాగా ఆడుతూ, ఎంజాయ్ చేసిన పిల్లలు.. ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాలంటే మొండికేస్తున్నారు. స్కూ్ల్‌కి వెళ్లమంటే వెళ్లమంటూ మారాం చేస్తున్నారు. దాంతో పిల్లలను స్కూల్‌కు పంపడం అనేది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. తాజాగా స్కూల్‌కి వెళ్లనన్న ఓ బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి స్కూల్‌కి తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేని విధంగా ఉంది.
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ మహిళ, ముగ్గురు పిల్లలు కలిసి మరో పిల్లాడి కాళ్లు, చేతులు పట్టుకుని స్కూల్ లోపలికి లాక్కెళుతున్నట్లుగా ఉంది. ఆ పిల్లాడు మాత్రం తాను స్కూల్‌కి వెళ్లనని పెద్ద పెద్దగా అరుస్తుండగా.. వారు అతని అరుపులను ఏమాత్రం లెక్కచేయలేదు. చేతులు, కాళ్లు పట్టుకుని స్కూళ్లో దించేశారు. ఈ ఫన్నీ వీడియోను ఐఏఎస్ అధికారి అవ్నిష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. ‘‘నేను నా స్కూల్ డేస్ మిస్ అయ్యాను’’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నవ్వుకుంటూనే.. ఆ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు. కొందరు నెటిజన్లు తమ బాల్య అనుభవాలను పంచుకున్నారు.
Viral Video:
ऐसे बच्चे भी बड़े होकर बोलते हैं, “I miss my School days.” pic.twitter.com/2AUXEhUs1B
— Awanish Sharan (@AwanishSharan) September 11, 2021
Also read:
Biggest Army : అతిపెద్ద సైన్యాన్ని కలిగిన 10 దేశాల జాబితా విడుదల.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
Organs Donation: శరీరంలోని ఏఏ అవయవాలను దానం చేయవచ్చు.. అసలు ప్రాసెస్ ఏంటి?
Mysterious Deaths: స్మశానవాటికలో అర్థరాత్రి ‘శవాల వర్షం’.. అది చూసి జనాలు హడలిపోయారు..!