
సెల్‌ఫోన్ కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్‌లా నటించింది. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి ఖరీదైన ఐఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి ఓనర్ ఫోన్ లేకపోవడాన్ని చూసి షాక్ అయ్యాడు. షాప్‌లోని సీసీటీవీ రికార్డు చూసి బిత్తరపోయాడు. ఎంతో చాకచక్యంగా ఓ యువతి ఖరీదైన ఐఫోన్‌ను దొంగిలించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
కోయంబత్తూరు జిల్లా గాంధీపురం సిటీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రముఖ టెక్స్‌టైల్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ మొబైల్ ఫోన్ షాప్‌కి ఓ యువతి వచ్చింది. సెల్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పి, దుకాణంలో ఉన్న వివిధ మోడళ్లను చూపించాలని సిబ్బందిని కోరింది. దీంతో ఉద్యోగులు ఒక్కొక్కటిగా పలు కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్‌లను షోకేస్ నుంచి తీసి టేబుల్‌పై ఉంచి ఆమెకు చూపించడం ప్రారంభించారు.
ఫోన్‌లను పరిశీలిస్తున్నట్లు నటించిన యువతి, మరో మోడల్ చూపించాలని ఉద్యోగిని కోరింది. ఉద్యోగి వెనక్కి తిరిగి మరో ఫోన్ తీసుకురావడానికి వెళ్లిన క్షణాన్ని అవకాశంగా మార్చుకుంది. టేబుల్‌పై ఉన్న ఐఫోన్ 13ను చాకచక్యంగా తన బ్యాగ్‌లో వేసుకుంది. అనంతరం ఏమాత్రం అనుమానం రాకుండా సాధారణంగా మాట్లాడి, ఎలాంటి కొనుగోలు చేయకుండా దుకాణం నుంచి బయటకు వెళ్లిపోయింది.
కొద్దిసేపటి తర్వాత ఉద్యోగులు టేబుల్‌పై ఉన్న ఫోన్‌లను తిరిగి షోకేస్‌లో సర్దుతుండగా ఒక ఐఫోన్ కనిపించకపోవడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే యువతిని వెతికినా అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, యువతి ఐఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దుకాణ యజమాని సీసీటీవీ వీడియోతో సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుటేజీ ఆధారంగా యువతిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్‌లా నటించి క్షణాల్లో ఖరీదైన మొబైల్‌ను దొంగిలించిన యువతి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దుకాణదారులు విలువైన వస్తువులను వినియోగదారులకు చూపించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి