Viral Video: ఏం ధైర్యం అక్కా నీది.. ఏకంగా సింహాన్ని ఎత్తుకొచ్చింది.. పాపం వద్దని మారాం చేస్తున్న మృగరాజు

|

Jan 13, 2023 | 5:37 PM

వీడియోలో ఓ మహిళ సింహాన్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వీధిలో మోసుకుంటూ వెళ్తుంది.. ఆ సమయంలో సింహం.. మహిళ చేతుల్లో నుంచి

Viral Video: ఏం ధైర్యం అక్కా నీది.. ఏకంగా సింహాన్ని ఎత్తుకొచ్చింది.. పాపం వద్దని మారాం చేస్తున్న మృగరాజు
Woman Carries Lion
Follow us on

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక రకాల వైరల్‌ వీడియోలు, ఫోటోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిన్న పిల్లలకు సంబంధించిన అందమైన వీడియోలు, ఫన్నీ సీన్స్‌ ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. కానీ, తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో మాత్రం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. వీడియో చూసిన నోరెళ్లబెట్టి మరీ చూస్తుండిపోతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ పిల్లినో, కుక్కనో మోస్తున్నట్టుగా తన భుజాలపై సింహాన్ని మోసుకెళ్తోంది.. వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో కేవలం 10 సెకన్ల నిడివి మాత్రమే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

అడవికి రారాజు సింహం.. ప్రమాదవశాత్తు ఎవరైనా దాని కంట పడ్డారో ఇక అంతే సంగతులు.. బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా భుజాలపై ఎత్తుకుని వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను యానిమల్స్‌ పవర్స్‌ (animals powers) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వీడియోలో ఓ మహిళ సింహాన్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వీధిలో మోసుకుంటూ వెళ్తుంది.. ఆ సమయంలో సింహం.. మహిళ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం మరింత ఆశ్చార్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘షాకింగ్‌’, ‘వండర్‌ వుమెన్‌..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కేవలం 10 సెకన్ల వ్యవధిగల ఈ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇకపోతే, వైరల్‌ అవుతున్న ఈ వీడియో కువైట్‌కు చెందినదిగా సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..