మాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు..? ఈ వంటకం తింటే ఇక చచ్చమే..! స్వీట్‌ పకోడా వీడియో వైరల్‌..

వీడియో చూడగానే ముందుగా అందరూ ఏవో ఉల్లిపాయ పకోడి, లేదంటే, మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ లాంటి ఏదో కమ్మటి స్నాక్‌ ఐటమ్ చేస్తున్నారని భావిస్తారు. ఎందుకంటే, శనగపిండిని కలిపి సిద్ధం చేసిన మిశ్రమం ముందుగా మనకు వీడియోలో కనిపించింది. దాన్నిట్టి ఉల్లిపాయ, బంగాళదుంప, మిరపకాయ, బచ్చలికూర వంటి

మాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు..? ఈ వంటకం తింటే ఇక చచ్చమే..! స్వీట్‌ పకోడా వీడియో వైరల్‌..
Kaju Burfi Pakoda

Updated on: Mar 08, 2024 | 2:10 PM

కలియుగం ప్రారంభమైందని, త్వరలో భూమి నాశనమవుతుందని కొందరు పెద్దలు తరచూ చెబుతుంటారు. ఆ మాటలు నిజమే అనిపిస్తుంది.. ఎందుకంటే మనం ఊహించలేనంతగా ఈరోజు స్ట్రీట్ ఫుడ్ పేరుతో మార్కెట్ లో వింత వింత ఆహారపదార్థాలు అమ్ముతున్నారు. కొందరు బిస్కెట్లతో బజ్జీలు చేస్తున్నారు. కొందరు ఐస్‌పై మసాలా వేసి అమ్ముతున్నారు. మరికొందరు గుడ్లలో చాక్లెట్ వేసి ఆమ్లెట్‌లు చేస్తున్నారు. మరికొందరు పానీ పూరీలో మ్యాగీని నింపుకుని తింటున్నారు. ఇలాంటివి అనేకం చిత్రవిచిత్రమైన వంటకాలు వెలుగు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో వింత వంటకం నెటిజన్లను ఊరిస్తోంది..కాదు కాదు.. నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా చేస్తుంది..ఇంతకీ ఏంటా వంటకం చూసేద్దాం..

ఈ వంటకాన్ని కాజు తక్లీ భాజీ అంటారు. అవునూ, పేరు వింటేనే ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ బజ్జీలు ఏంటంటే.. జీడిపప్పుతో తయారు చేసిన కాజు బర్ఫీతో తయారు చేసినవి..అవును మీరు విన్నది నిజమే.. అందరికీ ఎంతో ఇష్టమైన కాజు బర్ఫీని పిండిలో ముంచి నూనెలో వేయించి తయారుచేసిన స్వీట్. ఈ వింత ఆహారాన్ని చూస్తేనే మీకు తల తిరగటం ఖాయం.

ఇవి కూడా చదవండి

వీడియో చూడగానే ముందుగా అందరూ ఏవో ఉల్లిపాయ పకోడి, లేదంటే, మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ లాంటి ఏదో కమ్మటి స్నాక్‌ ఐటమ్ చేస్తున్నారని భావిస్తారు. ఎందుకంటే, శనగపిండిని కలిపి సిద్ధం చేసిన మిశ్రమం ముందుగా మనకు వీడియోలో కనిపించింది. దాన్నిట్టి ఉల్లిపాయ, బంగాళదుంప, మిరపకాయ, బచ్చలికూర వంటి కొన్ని కూరగాయలు తయారు చేసే ఈ బజ్జీలంటే చాలా మంది చాలా చాలా ఇష్టం.. కానీ, ఇక్కడ కనిపించిన మహిళ కాజు బర్ఫీతో స్వీట్‌ తయారు చేసింది. దాంతో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. ఇలాంటి వంటకాలు ఎందుకు ట్రై చేస్తారమ్మా అంటూ దండపెడుతున్నారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..