Video Viral: కర్ణాటక సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. వైరల్ అయిన వీడియో..

ఓ మహిళ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని ముద్దులతో ముంచేత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దుల వర్షం కురిపించింది...

Video Viral: కర్ణాటక సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. వైరల్ అయిన వీడియో..
Boomai

Updated on: Nov 02, 2021 | 2:56 PM

ఓ మహిళ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని ముద్దులతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. దీంతో సీఎం కాస్త అసౌకర్యానికి గురయ్యారు.

జనసేవక్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి బసవరాజ్ సోమవారం బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన ఆమె సంతోషంలో బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టింది. మహిళ ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. పక్కనే ఉన్న మంత్రి నారాయణ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదని ఆమెను వారించే ప్రయత్నం చేశారు. సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతోనే ఉంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Read Also.. Viral Video: రెండు తలలతో పందిరూపంలో ఆవుదూడ..పుట్టాక షాకింగ్‌ ఘటన.. వీడియో