Viral: ఖరీదైన హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న మహిళ.. తెల్లారి లేచేసరికి ఆమె ఒంటిపై..

|

Jun 15, 2024 | 6:35 PM

రూమ్‌తో సహా పరిసరాలు పరిశుభ్రత, ఆహార నాణ్యత లాంటివి మంచిగా ఉండే క్రమంలో చాలామంది వేరే సిటీలకు టూర్ వెళ్లినప్పుడు లగ్జరీ హోటల్స్‌నే ఆప్షన్‌గా ఎంచుకుంటారు. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి ఖరీదైన హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సందర్భాల్లో కొన్ని షాకింగ్ సంఘటనలు ఎదురవుతుంటాయి.

Viral: ఖరీదైన హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న మహిళ.. తెల్లారి లేచేసరికి ఆమె ఒంటిపై..
Representative Image
Follow us on

రూమ్‌తో సహా పరిసరాలు పరిశుభ్రత, ఆహార నాణ్యత లాంటివి మంచిగా ఉండే క్రమంలో చాలామంది వేరే సిటీలకు టూర్ వెళ్లినప్పుడు లగ్జరీ హోటల్స్‌నే ఆప్షన్‌గా ఎంచుకుంటారు. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి ఖరీదైన హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సందర్భాల్లో కొన్ని షాకింగ్ సంఘటనలు ఎదురవుతుంటాయి. గదులు పరిశుభ్రంగా లేకపోవడం, ఆహార నాణ్యత లోపం, నల్లులు.. పురుగులు లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖరీదైన హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తెల్లారి లేచేసరికి ఆమె శరీరంపై..

వివరాల్లోకెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్లాక్‌పూల్‌ ప్రాంత పరిధిలో షారపన్ హస్లామ్ అనే మహిళ తన స్నేహితురాలు పుట్టినరోజు పార్టీ నిమిత్తం అక్కడికి వచ్చి.. స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన హోటల్‌లో రెండు రోజుల పాటు గది బుక్ చేసుకుంది. ఇందుకోసం రూ. 17 వేలు కూడా చెల్లించింది. ఇక స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చిన ఆ మహిళ.. రాత్రి వచ్చి గదిలో నిద్రపోయింది. సీన్ కట్ చేస్తే..

తెల్లారి లేచేసరికి ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఒంటిపై మొత్తం దదుర్లు ఉండటంతో పాటు ఒళ్లంతా దురదపుట్టింది. సడన్‌గా ఇలా జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. కొంచెం షాక్ నుంచి తేరుకుని ఆమె తన బెడ్ చెక్ చేయగా.. లోపలంతా నల్లులు ఉండడాన్ని చూసి ఖంగుతింది. ఈ విషయాన్ని ఆమె హోటల్ యాజమాన్యం చెప్పి.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లగ్జరీ రూమ్ కోసం వేల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకుని.. ఇలాంటి నాసిరకమైన గది కేటాయిస్తారా అని మండిపడింది. కాగా, దీనిపై హోటల్ యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు తెలియజేయడమే కాకుండా.. నష్టపరిహారం కింద రూ.8,787 చెల్లించింది. ఇక తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ సదరు మహిళ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి