మనిషి జీవితం కరోనాకు ముందు తర్వాత అని చెప్పవచ్చు. ప్రపంచంలో అనేక దేశాలు ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చిన్నా, పెద్ద కంపెనీలు తమ ఖర్చులను అదుపులో పెట్టుకునే పనిలో పడ్డారు. దీంతో అనేక మంది ఉద్యోగస్తులను విధులనుంచి తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగం బాగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. రోజు తెల్లవారితే ఏ కంపెనీ తమ ఉద్యోగస్తులను తీసేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగస్తులకు మంచి రోజులు కావని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న, పెద్ద కంపెనీలు భారీ ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోస్టాఫ్ట్, అమెజాన్ సహా అనేక కంపెనీలు తమ సంస్థల్లోని ఉద్యోగస్తులను భారీగా తొలగించింది. దీంతో ఉద్యోగాన్ని పోగొట్టున్న వారు మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇది ఉద్యోగం కోల్పోయి బాధపడుతున్న నిరుద్యోగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మళ్ళీ సరికొత్త ఆశలతో కొత్త ఉద్యోగం కోసం వెదకడం ప్రారంభిస్తారు.
బేబీకోర్ట్‌ఫిట్స్ పేరుతో ఒక మహిళ ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిస్తే.. మీరు కూడా దీనినే లక్ అంటారు అని అంటారు.. అంతేకాదు… అదృష్ట వంతుడిని పాడుచేసే వాడు లేదు… దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడని అంటారు. వాస్తవానికి ఈ మహిళ పని చేసే కంపెనీని నుంచి తొలగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగం నుంచి తొలగించిన మూడు రోజుల్లో వేరే కంపెనీలో మళ్ళీ కొత్త ఉద్యోగం వచ్చింది. అది కూడా పాత జీతం కంటే 50% సాలరీ హైక్ తో అంది వర్క్ ఫ్రమ్ హోమ్ తో.. ఇది కల కాదు నిజం అంటుంది ఆ మహిళ.
మంగళవారం ఉద్యోగం పోయింది.. శుక్రవారం కొత్త ఉద్యోగం వచ్చింది.
ఆ మహిళ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాసింది, ‘మంగళవారం నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. శుక్రవారం.. నాకు మరొక కొత్త సంస్థలో జాబ్ ఆఫర్ వచ్చింది. అక్కడ 50% ఎక్కువ జీతం .. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ (WFH)తో సహా అనేక సౌకర్యాలు ఇచ్చారని పేర్కొంది.
This is a reminder to always back yourself. Never let the opinions of others make you question who you are or should be. (I’m saying this after letting myself wallow in self pity for several days)
— babyCourtfits (@2020LawGrad) January 29, 2023
అంతేకాదు ఆ మహిళ ‘మనల్ని మనం ఎప్పుడూ విశ్వసించాలని ఈ సంఘటన గుర్తుచేస్తుందని తెలిపింది. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మన సామర్థ్యాన్ని ప్రశ్నించేలా చేయకూడదని .. ఉద్యోగం పోయినప్పుడు నాకు బాధగా అనిపించింది. అప్పుడు నాకు నేనే ఇలా చెప్పుకున్నా.. రేపు నీది.. నిన్ను నీవు నమ్ముకో అని అంది ఆ మహిళా.
బేబీ కోర్ట్ ఫిట్స్ పేరుతో ట్విటర్ ఖాతా ఉన్న ఈ మహిళ న్యాయ సేవా రంగంలో పనిచేస్తున్నారు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పింది. ‘గత వారంరోజులుగా నాకు అండగా నిలిచిన వారికీ థాంక్స్ చెప్పింది. ఆ వారం రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి.. కానీ నేను బలమైన స్త్రీని అని తనపై తనకు నమ్మకాన్ని చెప్పకనే చెప్పేసింది ఆ మహిళ.
మరిన్ని వైరల్ న్యూస్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..