Eggs: మీరెప్పుడైన గుండ్రని గుడ్డును చూశారా..? ఇక దీని ధర తెలిస్తే కంగుతింటారు..

|

Jun 19, 2023 | 5:55 PM

ఆమె వెంటనే ఈ ప్రత్యేకమైన గుడ్డును ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వార్త వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటిది కోట్లలో ఒక్కటి మాత్రమే గుండ్రంగా ఉండే గుడ్డు ఉన్నట్టుగా తెలిసింది. అంతేకాదు.. ఒకప్పుడు ఇలాంటి గుండ్రని గుడ్డు 78 వేల రూపాయలకు అమ్ముడుపోయిందని సమాచారం. ఈ మేరకు ఈ గుడ్డు ధర కూడా ఇప్పుడు రూ..

Eggs: మీరెప్పుడైన గుండ్రని గుడ్డును చూశారా..? ఇక దీని ధర తెలిస్తే కంగుతింటారు..
Roundest Egg
Follow us on

ప్రోటీన్‌ రిచ్‌ఫుడ్‌ గుడ్డు.. ఈ గుడ్డుకు సంబంధించి అందరిలో ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అది కోడి ముందా..? లేదంటే గుడ్డు ముందా..? అని.. అయితే, ఇటీవల దీనికో సమాధానం దొరికినట్టుగా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ గుడ్డు మన శరీరానికి ప్రాథమిక పోషకాహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే కొవ్వులు, సూక్ష్మపోషకాలకు మంచి వనరుగా చెబుతారు ఆరోగ్య నిపుణులు. రోజుకో ఉడికించి గుడ్డు ఆరోగ్యానికి అత్యవసరంగా సూచిస్తారు. పైగా గుడ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. పెద్దగా ఖరీదైనవి కూడా కాకపోవటం వల్ల సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు గుడ్డుకు సంబంధించి మరో విషయం వైరల్‌ అవుతోంది. సాధారణంగా కనిపించే గుడ్డు దాని ప్రత్యేక ఆకారం, పరిమాణం కారణంగా దాని ధర వేలల్లో పలుకుతోంది. ఈ వింత గుడ్డు ఆకారం పూర్తిగా గుడ్రంగా ఉండటంతో దీని ధర, ఆకారణం ఇప్పుడు వార్తలోకెక్కింది. ఒక సాధారణ సూపర్ మార్కెట్లో గుడ్లు కొనుగోలు చేసిన ఒక మహిళ ఈ గుండ్రని గుడ్డును గుర్తించి ఆశ్చర్యపోయింది. ఇక ఆ తర్వాత ఈ గుడ్డును వేలం వేసి మరీ విక్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని ఒక సూపర్ మార్కెట్లో ఈ గుడ్డును కనుగొన్నారు. మెల్‌బోర్న్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో జాక్వెలిన్ ఫెల్గేట్ అనే మహిళ కొనుగోలు చేసిన గుడ్లలో ఇది కనిపించింది. దాంతో ఆమె వెంటనే ఈ ప్రత్యేకమైన గుడ్డును ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వార్త వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటిది కోట్లలో ఒక్కటి మాత్రమే గుండ్రంగా ఉండే గుడ్డు ఉన్నట్టుగా తెలిసింది. అంతేకాదు.. ఒకప్పుడు ఇలాంటి గుండ్రని గుడ్డు 78 వేల రూపాయలకు అమ్ముడుపోయిందని సమాచారం. ఈ మేరకు ఈ గుడ్డు ధర కూడా అంతే ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోడిగుడ్లు కూడా ఇంత ఎక్కువ ధరలకు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందంటూ జాక్వెలిన్ ఫెల్గేట్ ట్విట్‌ చేశారు. ఇకపై మీకూ ఇలాంటి గుండ్రని గుడ్డు వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా ఉంచుకోండి అని పేర్కొంది. మీకు ఎప్పుడైనా పూర్తి గుండ్రంటి గుడ్డు కనిపిస్తే వేలం వేయండి. ఆరు రూపాయల గుడ్డు అరవై వేల రూపాయలకు అమ్ముడుపోవచ్చునంటూ చెప్పారు. కాగా, ఈ వీడియో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. సోషల్ మీడియా వినియోగదారులు వీడియోపై తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..