RattleSnakes: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 పాములు.. ఒకే ఇంటిలో.. వింటేనే భయమేస్తుంది కదూ..

|

Oct 18, 2021 | 3:13 PM

సాధారణంగా ఒక్క పాము చూస్తేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది 90 పాములు ఒకేసారి కనిపిస్తే మన గుండె ఆగిపోతుంది. కానీ పాములు పట్టేవాళ్లకు ఇది కామన్. సోనోమా కౌంటీ సరీసృపాల డైరెక్టర్ వోల్ఫ్‎కు ఒక రోజు ఫోన్ వచ్చింది...

RattleSnakes: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 పాములు.. ఒకే ఇంటిలో.. వింటేనే భయమేస్తుంది కదూ..
Snake
Follow us on

సాధారణంగా ఒక్క పాము చూస్తేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది 90 పాములు ఒకేసారి కనిపిస్తే మన గుండె ఆగిపోతుంది. కానీ పాములు పట్టేవాళ్లకు ఇది కామన్. సోనోమా కౌంటీ సరీసృపాల డైరెక్టర్ వోల్ఫ్‎కు ఒక రోజు ఫోన్ వచ్చింది. తమ ఇంట్లో పాము ఉంది దానిని పట్టుకోవాలని కోరారు. అతను వెంటనే ఉత్తర కాలిఫోర్నియాలోని ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంటి కింద రాళ్లలో 90 పైగా ర్యాటిల్ స్నేక్స్‎ను అతను గుర్తించారు. మొదట ఒక పామును బయటకు తీయగా మరిన్ని పాములు బయటకు వచ్చాయి.

దీంతో అతను రెండు బకెట్లు పట్టుకుని చేతి గ్లౌజ్ వేసుకుని పాములను బయటకు తీశారు. “నేను తరువాతి దాదాపు నాలుగు గంటలపాటు పాములను పట్టుకున్నాను” అని వోల్ఫ్ చెప్పాడు. 22 పెద్ద, 59 పిల్ల పాములను పట్టుకోవడానికి 24-అంగుళాల (60-సెంటీమీటర్) కర్రను ఉపయోగించాడు. చనిపోయిన పాములు కూడా పట్టుకున్నారు. వోల్ఫ్ 32 సంవత్సరాలుగా పాములను కాపాడే ప్రయత్నంలో 13 సార్లు కాటుకు గురయ్యాడు. అడవిలో ఒకే చోట డజన్ల కొద్దీ పాములు చూశానని కానీ ఎప్పుడూ ఇంటి కింద ఇన్ని పాములు చూడలేదని చెప్పాడు.

ఇలాంటి పాములు సాధారణంగా అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు నిద్రాణస్థితిలో ఉంటాయని చెప్పాడు. ఇవి భూమిలో, వెచ్చని ప్రదేశాలలో ఉంటాయన్నారు. ఇంటి యజమానులు ఇల్లు నిర్మించినప్పుడు ఏ రాళ్లను తొలగించలేదని.. అందుకే పాములు అక్కడ చేరాయని వోల్ఫ్ చెప్పారు. “పాములు ఆ ప్రదేశాన్ని అనువుగా మార్చుకుని అక్కడే ఉన్నట్లు గుర్తించారు.

Read Also.Viral Video: ఏయ్.. ఎవరది.. నన్నే ఆటపట్టిస్తారా.. కోతితో ఆట అమ్మచ్చి.. ఫన్నీ వీడియో వైరల్…