Watch: నిర్మానుష్య ప్రదేశంలో యువతిపై దాడి చేసిన దొంగ.. సివంగిలా ఎదిరించిన ఆమెకు ఖాకీల హ్యాట్సాఫ్‌.. వీడియో వైరల్‌

|

Sep 08, 2022 | 9:52 PM

ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. కాగా, ఆ మహిళ సివంగిలా ఆ దొంగపై ఎదురు దాడికి దిగింది. ఆ దొంగ షర్ట్‌ పట్టుకుని చడామడా వాయిస్తూ..

Watch: నిర్మానుష్య ప్రదేశంలో యువతిపై దాడి చేసిన దొంగ.. సివంగిలా ఎదిరించిన ఆమెకు ఖాకీల హ్యాట్సాఫ్‌.. వీడియో వైరల్‌
Woman Fights
Follow us on

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ చోరీ సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నిర్మానుష్య ప్రాంతలో నడుస్తూ వెళ్తున్న ఓ మహిళపై ఓ దొంగదాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె ఆ దొంగోడికి చుక్కలు చూపించింది. అతడితో వీరోచితంగా ఫైట్‌ చేసింది. అతడు చోరీ చేసిన మొబైల్‌ ఫోన్‌ తిరిగి సంపాదించుకుంది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజ్‌ని సేకరించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది.

ఈ నెల సెప్టెంబర్‌ 4న జరిగినట్టుగా తెలిసింది. ఆ రోజు రాత్రి టిక్రీ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతం తాజ్‌పూర్ పహారీ వద్ద స్నేహితుడ్ని కలిసేందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఒక దొంగ ఆమె చేతిలోని మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడు. ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. కాగా, ఆ మహిళ సివంగిలా ఆ దొంగపై ఎదురు దాడికి దిగింది. ఆ దొంగ షర్ట్‌ పట్టుకుని చడామడా వాయిస్తూ ఉతికి ఆరేసింది. పెనుగులాటలో కిందపడిన తన మొబైల్‌ ఫోన్‌ను తీసుకుంది. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ మహిళ తెగువను అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి