AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా.. హగ్స్ ఇస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ, ఎందుకంటే!

డబ్బు సంపాదించడం కొందరికి కష్టమైన పని అయితే, మరికొందరికి చాలా తేలిక. కేవలం ఒక్కరోజులో కోట్లాది రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. మరికొందరు మాత్రం కొన్ని వేల రూపాయలు సంపాదించడానికి నెల రోజులు కష్టపడాల్సి వస్తుంది. అయితే సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదనీ, జస్ట్ ఒక ఐడియా వస్తే చాలు అంటోంది ఓ మహిళ.

Viral News: డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా.. హగ్స్ ఇస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ, ఎందుకంటే!
Hugs
Balu Jajala
|

Updated on: Mar 27, 2024 | 4:13 PM

Share

డబ్బు సంపాదించడం కొందరికి కష్టమైన పని అయితే, మరికొందరికి చాలా తేలిక. కేవలం ఒక్కరోజులో కోట్లాది రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. మరికొందరు మాత్రం కొన్ని వేల రూపాయలు సంపాదించడానికి నెల రోజులు కష్టపడాల్సి వస్తుంది. అయితే సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదనీ, జస్ట్ ఒక ఐడియా వస్తే చాలు అంటోంది ఓ మహిళ. అలాంటి మహిళే తన ఐడియాతో లక్షలు సంపాదించేస్తోంది. కేవలం ఒక గంటలో సుమారు రూ. 7400 సంపాదిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆమె ఏమి చేస్తుందో తెలుసా

ఈ మహిళ పేరు అనికో రోజ్. ఆమె ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఉంటుంది. ‘మున్నా భాయ్ MBBS’ సినిమా చూసినట్లయితే.. సంజయ్ దత్ జనాలకు మ్యాజిక్ కౌగిలింతలు ఇచ్చే సీన్స్ మీకు గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆమె కూడా అదే చేస్తోంది. అయితే సినిమాలో మంచి ప్రయత్నం కోసం హీరో హగ్స్ ఇస్తే.. ఈమె సోషల్ సర్వీస్ తో పాటు.. దానిని ఓ కెరీర్ గా ఎంచుకోవడం విశేషం.

అనికో చేసే పనిని కౌగిలించుకోవడం అంటారు. 42 ఏళ్ల అనికో గత మూడేళ్లుగా కౌగిలింతలు ఇస్తోంది. ఇలా ఓ మనిషిని గట్టిగా హత్తుకొని హగ్స్ ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనట్లయితే ఓ కౌగిలింత ఇవ్వడం వల్ల మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు అని చెబుతోంది. అందుకే ఆమె వద్ద కస్టమర్ల క్యూ ఎక్కవగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె గంటకు 70 పౌండ్లు అంటే దాదాపు రూ.7400 వసూలు చేస్తుంది.

తన వద్దకు వచ్చే కస్టమర్లలో 20 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులు కూడా ఉన్నారని అనికో చెప్పారు. సాధారణంగా వారి థెరపీ సెషన్ ఒక గంట మాత్రమే ఉన్నప్పటికీ, కొంతమంది ఈ సెషన్‌ను కూడా పొడిగిస్తారు. దీని కోసం వారు అదనపు డబ్బులు కూడా తీసుకుంటుంది ఈ మహిళ.