అయ్యో పాపం.. ఇదెక్కడి ఘోరం.. చికెన్ ముక్క ఇరుక్కుని మహిళ మృతి

ఇద్దరూ కలిసి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ పెట్టారు. అయితే, బిర్యానీ తింటుండగా.. చికెన్ ముక్క ఆ యువతి గొంగులో ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బంది పడింది. చాలా సేపటి వరకు గొంతులో ఇరుక్కుపోయిన చికెన్‌ ముక్క బయటకు రాక అవస్థ పడింది..ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా మారటంతో ఆమె అక్కడే కుప్పకూలింది.

అయ్యో పాపం.. ఇదెక్కడి ఘోరం.. చికెన్ ముక్క ఇరుక్కుని మహిళ మృతి
Chicken Biryani

Updated on: May 25, 2025 | 9:05 PM

కాలం కలిసి రాకపోతే.. మామూలు తాడు కూడా పాములా మారి కాటేస్తుందని పెద్దలు తరచూ సామెత చెబుతుంటారు.. సరిగ్గా ఈ సామెతను నిజం చేసేలా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో‌ ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇద్దరూ కలిసి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ పెట్టారు. అయితే, బిర్యానీ తింటుండగా.. చికెన్ ముక్క ఆ యువతి గొంగులో ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బంది పడింది. చాలా సేపటి వరకు గొంతులో ఇరుక్కుపోయిన చికెన్‌ ముక్క బయటకు రాక అవస్థ పడింది..ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా మారటంతో ఆమె అక్కడే కుప్పకూలింది.

వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఊరిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..