Video Viral: రీల్స్ కోసం రద్దీగా ఉన్న రోడ్డుపై మహిళ డ్యాన్స్.. లీగల్ నోటీసులు జారీ..

|

Aug 20, 2024 | 6:50 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూస్ కోసం ప్రమాదాల్ని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యూస్ పిచ్చితో ఏం చేస్తున్నారో వాళ్లే అర్థం కావడం లేదు. కొత్తగా చేయాలని.. పది మందిలో దోషి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే మనం చాలానే చూసి ఉంటాం. తాజాగా ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. రీల్స్ కోసం ఏకంగా వర్షంలో పైగా రద్దీగా ఉండే..

Video Viral: రీల్స్ కోసం రద్దీగా ఉన్న రోడ్డుపై మహిళ డ్యాన్స్.. లీగల్ నోటీసులు జారీ..
Video Viral
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూస్ కోసం ప్రమాదాల్ని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యూస్ పిచ్చితో ఏం చేస్తున్నారో వాళ్లే అర్థం కావడం లేదు. కొత్తగా చేయాలని.. పది మందిలో దోషి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే మనం చాలానే చూసి ఉంటాం. తాజాగా ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. రీల్స్ కోసం ఏకంగా వర్షంలో పైగా రద్దీగా ఉండే ప్రదేశంలో డ్యాన్స్ చేసింది మహిళ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్ల దండకం మొదలు పెట్టారు. ఇంతకీ ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో.. ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో జోరుగా వర్షం పడుతుంది. ఓ మహిళ కారు పై నుంచి కిందుకు దూకి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుంది. ఆ రోడ్డు బాగా రద్దీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాహనాలు వేగంగా రోడ్డుపై వెళ్తున్నాయి. కానీ ఆ మహిళ ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్డుపై చిందులు వేస్తుంది. పైగా సైడ్‌కి కూడా కాదు. రోడ్డుకి కాస్త మధ్యలోనే డ్యాన్స్ వేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాళ్లు ఆమెను చూస్తున్నారు. వర్షంలో మహిళ డ్రెస్ మొత్తం తడిచిపోయి.. అసభ్యకరంగా ఉంది. అయినా ఏమీ లెక్క చేయకుండా డ్యాన్స్ చేసిన.. వీడియోను సదరు మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోపై యూపీ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సదరు మహిళలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అది రోడ్డు అనుకున్నావా తల్లీ.. నీ ఇల్లు అనుకున్నావా’.. ‘రీల్స్ కోసం ఇంతలా చేయడం అవసరమా’.. ‘వ్యూస్ కోసం మరీ ఇంతలా దిగజారాలా’.. ‘వీడియో తీస్తున్న వారికి కూడా బుద్ధి లేదు’.. ‘రోడ్డు మధ్యలో ఈ డ్యాన్సులు ఏంటి.. ఏదన్నా ప్రమాదం జరిగితే’ అంటూ మహిళపై తీవ్రంగా మండి పడుతున్నారు.