నవ మాసాలు మోసి అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది. కానీ, బ్రెజిల్‌కు చెందిన 81 ఏళ్ల ఈ వృద్ధురాలు మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది. నమ్మడానికి ఆశ్చర్యం అనిపించింనా ఇది నిజం. ఆమె అంతకముందకు ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత తన కడుపులో ఇంకో మృతి చెందిన పిండం ఉందనే విషయం తెలియకుండానే ఆమె జీవనం సాగించింది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించిన చికిత్స కోసం డానియెలా వెరాను మొదట ఆమె ఇంటికి సమీపంలోని ఒక చిన్న ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం వైద్యుడు వృద్ధురాలికి పలు పరీక్షలు నిర్వహించగా కడుపులో రాయిలాంటిది ఏదో ఉన్నట్లు గుర్తించి పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అక్కడి డాక్టర్లు ఆమెకు టెస్టులు చేసి స్టన్ అయ్యారు. అప్పటికే ఏడుగురు పిల్లల తల్లి ఆమె… చివరిసారిగా 1968లో గర్భవతి అయింది. గత 56 ఏళ్లుగా అది ఆమె కడుపులో మృత శిశువును మోస్తూనే ఉంది. లోపల ఆ శిశువు దేహం రాయిలా మారిపోయింది. కానీ ఆమెకు ఆ విషయం తెలియదు. 3డి స్కాన్ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్న డాక్టర్లు శస్త్రచికిత్స చేసి వృద్ధురాలి కడుపులో ఉన్న స్టోన్ బేబీని బయటకు తీశారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే వృద్ధురాలు ఐసీయూలో తుదిశ్వాస విడిచింది. వృద్ధురాలి కడుపులోంచి బయటకు తీసిన ఈ అరుదైన ‘స్టోన్ బేబీ’ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.
🚨'Stone baby': elderly woman discovers calcified fetus she carried for more than 5 decades
In a rare medical case from Mato Grosso do Sul, Brazil, an 81-year-old woman, Daniela Almeida Vera, discovered she had been carrying a calcified fetus for over five decades. This… pic.twitter.com/HSu885D4Kd
— Githii (@githii) March 21, 2024
శరీరం కడుపులోని చనిపోయిన పిండాన్ని బయటకు పంపలేనప్పుడు, దాని చుట్టూ కాల్షియం పూత ఏర్పడటం ప్రారంభమవుతుంది. క్రమంగా ఆ మృత పిండం గట్టిగా అయి.. రాయి మాదిరిగా మారుతుంది. ఈ వైద్య పరిస్థితిని లిథోపెడియన్ లేదా స్టోన్ బేబీ అంటారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..