Break Millionaire: మరణించేముందు తండ్రి పెట్టిన ఒక్క కండిషన్.. రూ.93 కోట్ల ఆస్తి ఉన్నా పొందలేని మహిళ..

|

Jun 23, 2022 | 8:38 AM

ఆస్ట్రేలియాలోని సడ్నీ పరిధికి చెందిన క్లేర్ బ్రౌన్ అనే మహిళ రూ. 93 కోట్లకు వారసురాలు.. ఆమెకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది.. కోట్లకు వారసురాలు అయినప్పటికీ సామాన్య జీవితాన్ని గడిపేస్తుంది.

Break Millionaire: మరణించేముందు తండ్రి పెట్టిన ఒక్క కండిషన్.. రూ.93 కోట్ల ఆస్తి ఉన్నా పొందలేని మహిళ..
Viral
Follow us on

ఆమె కోట్లకు వారసురాలు.. ఎన్నేళ్లైన తిన్నా తరగని ఆస్తి.. ఆమెకు మాత్రమే కాదు.. తన పిల్లల పిల్లలు సైతం కూర్చుని బ్రతికేయ్యెచ్చు. కోట్లు సంపాందించిన తండ్రి.. అయినా రూపాయి వాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కూతురు.. రూ.93 కోట్ల ఆస్తి కళ్లముందే ఉన్న అనుభవించలేని మహిళ.. కోట్లు ఉన్నప్పటికీ సాధారణ జీవితం గడిపేస్తూ… వైద్యం చేయించుకోవడానికి సాయం కోసం ఎదురుచూస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఆస్తి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.. ఇందుకు కారణం చనిపోవడానికి ముందు ఆమె తండ్రి పెట్టిన ఒకే ఒక్క కండిషన్.. నియమం చిన్నదే అయినా.. ఆమెను ఆస్తికి దూరం చేసింది. ఇంతకీ ఎవరా మహిళ .. ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందామా..

ఆస్ట్రేలియాలోని సడ్నీ పరిధికి చెందిన క్లేర్ బ్రౌన్ అనే మహిళ రూ. 93 కోట్లకు వారసురాలు.. ఆమెకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది.. కోట్లకు వారసురాలు అయినప్పటికీ సామాన్య జీవితాన్ని గడిపేస్తుంది.. ప్రస్తుతం ఆమె అటెన్షన్ డెఫిసిట్/ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోంది.. తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నానని.. వైద్యం చేయించుకోవడానికి తనకు ఆస్తి ఇవ్వాలంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించింది.. అయితే తన తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‏తో ఆస్తి తనకు రాకుండా ఉంది.. ఆమెకు శాశ్వత ఉద్యోగం వచ్చి.. నలుగురికి సాయం చేసే స్థాయి ఉన్నప్పుడే ఆస్తి తన కూతురికి చెందుతుందని సదరు మహిళ తండ్రి చనిపోయే ముందు కండీషన్ పెట్టాడు.. దీంతో ప్రస్తుతం ఆరోగ్యానికి చికిత్స చేయించుకునేందుకు సైతం సాయం కోసం ఎదురుచూపులు చూస్తుంది.. ప్రస్తుతం ఆస్తి ఆమె తండ్రి స్థాపించిన ట్రస్టు అధీనంలో ఉంది.. నిబంధనలు పాటిస్తేనే ఆస్తిని ఇస్తామంటున్నారు ట్రస్టు నిర్వాహకులు..ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. కోట్లకు అధిపతి అయినప్పటికీ రూపాయి కూడా వాడుకోలేని ధీనస్థితిలో ఉన్న ఆమెకు స్థానికంగా బ్రేక్ మిలియనీర్ అని పిలుస్తుంటారు..