ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..

ఈ క్రమంలోనే మార్చి 20 గురువారం రోజున ఈ జంట ఏదో విషయంలో గొడవ పడ్డారు. వారి మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కోపంగా ఉన్న భార్య చివరికి భర్త నాలుకను కొరికేసింది. గాయపడిన కన్హయ్యలాల్‌ను అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. తెగిపోయిన నాలుకను కుట్లు వేసి చికిత్స అందించారు వైద్యులు.

ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
Wife Bites Off Husband Tongue

Updated on: Mar 25, 2025 | 5:15 PM

భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, అపార్థాలు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఈ వివాదాలు తీవ్రమై ఘర్షణలకు దారి తీస్తుంటాయి. పరస్పర దాడుల వరకు వెళ్తుంటాయి. భార్యాభర్తల మధ్య ఇలాంటి తగాదాలు, గొడవలకు సంబంధించిన వార్తలు చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే, కోపంతో భర్త నాలుకను కోరికేసి ముక్కలుగా చేసిన వింత కేసు ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త నాలుకను కొరికేసింది ఆ భార్య. ఈ వార్త ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా బకాని పట్టణంలో ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ సైన్ (25), సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్ ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ విభేదాలు, తగాదాలు జరిగేవి. ఈ క్రమంలోనే మార్చి 20 గురువారం రోజున ఈ జంట ఏదో విషయంలో గొడవ పడ్డారు. వారి మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కోపంగా ఉన్న భార్య చివరికి భర్త నాలుకను కొరికేసింది. గాయపడిన కన్హయ్యలాల్‌ను అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. తెగిపోయిన నాలుకను కుట్లు వేసి చికిత్స అందించారు వైద్యులు.

ఈ సంఘటన తర్వాత, రవీనా కూడా గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కన్హయ్యలాల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రవీనా సైన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..