Viral: తల్లిని సర్‌ప్రైజ్ చేయాలనుకుంది.. కట్ చేస్తే.. పొరపాటు చేసి ఖంగుతిన్నది.. అసలేం జరిగిందంటే!

|

Sep 05, 2022 | 1:07 PM

ఓ కూతురు తన తల్లిని సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. అందులో భాగంగానే తనకు వచ్చిన..

Viral: తల్లిని సర్‌ప్రైజ్ చేయాలనుకుంది.. కట్ చేస్తే.. పొరపాటు చేసి ఖంగుతిన్నది.. అసలేం జరిగిందంటే!
Viral News 1
Follow us on

ఓ కూతురు తన తల్లిని సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. అందులో భాగంగానే తనకు వచ్చిన ఫస్ట్ మంత్ శాలరీని ఆమె అకౌంట్‌కు పంపింది. ఏముంది దీనిలో అని అనుకుంటున్నారా.? అయితే కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. సదరు యువతి తన తల్లి అకౌంట్‌కు డబ్బులు పంపానని అనుకుంది.. కానీ ఆ డబ్బు వేరొకరి ఖాతాలోకి వెళ్లింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.!

వివరాల్లోకి వెళ్తే.. మలేషియాకు చెందిన ఫహదా అనే యువతి తన మొదటి నెల సంపాదనను తల్లికి ఇచ్చి ఆశ్చర్యపరచాలని అనుకుంది. అందులో భాగంగానే ఆమె అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ఇక్కడ సదరు యువతి చేసిన తప్పు ఏంటంటే..! ఆమె తన తల్లి ఖాతా నెంబర్ అనుకుని.. వేరే వ్యక్తి అకౌంట్‌లోకి డబ్బు వేసింది. ఈ విషయం ఆమె తల్లి చెప్తేనే కాని తెలియదు. దీంతో కంగారూపడిన ఫహదా.. వెంటనే పొరపాటున డబ్బు పంపించిన సదరు వ్యక్తి అకౌంట్ డీటయిల్స్ అన్నింటినీ సేకరించింది.

సదరు వ్యక్తికి ఫోన్ చేసిన ఫహదా.. అతడి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ విని ఒక్కసారిగా కంగుతిన్నది. ‘పొరపాటున నా తల్లి అకౌంట్ అనుకుని.. మీ ఖాతాకు డబ్బు పంపించేశాను. దయచేసి తిరిగి ఇవ్వండి ప్లీజ్’ అని ఆమె అతడ్ని ప్రాధేయపడగా… ‘పొరపాటున నాకు పంపిన ఆ డబ్బు మళ్లీ మీకు పంపించను. మీరు దాన్ని డొనేషన్ చేశారని మర్చిపోండి’ అని సదరు వ్యక్తి సమాధానం ఇచ్చాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకోవడం ఫహదా వంతైంది. ఇదంతా కూడా ఆమె టిక్‌టాక్ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

ఆగండీ.. ఆగండీ.. కథ అయిపోయిందని అనుకోవద్దు. ఆఖరి ట్విస్ట్ ఒకటి ఉంది. ఫహదా తన వీడియో చివర్లో.. అవతలి వ్యక్తి పైన పేర్కొన్న మాటలు కేవలం తనను ఆటపట్టించడానికే అన్నాడని.. చివరికి తన డబ్బు తనకు పంపించేశాడని చెప్పుకొచ్చింది. చూశారా.! ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు అకౌంట్ నెంబర్‌ను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.(Source)