‘దొంగ’ డ్యాన్సర్ ‘టిక్‌టాక్’ స్టారయ్యాడు

| Edited By: Pardhasaradhi Peri

Sep 05, 2019 | 3:06 PM

డ్యాన్స్ అంటే అతడికి ఇష్టం. ‘టిక్‌టాక్‌’ అంటే ఇంకా పిచ్చి. దీంతో తనకు వచ్చిన డ్యాన్స్‌ను చేస్తూ ‘టిక్‌టాక్‌’లో స్టార్‌ అయ్యాడు ఆ యువకుడు. అంతేకాదు డ్యాన్సులతో మెప్పించి ఏకంగా 40వేల ఫాలోవర్లను కూడా సంపాదించుకున్నాడు. అయితే బయట ఇతగాడు చేసే నిర్వాకం ఏంటో తెలుసా..! దొంగతనం. మీరు చదివేది నిజమేనండి. ఒకటి, రెండు కాదు ఇతగాడిపై ఆరు దొంగతనం కేసులు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు […]

‘దొంగ’ డ్యాన్సర్ ‘టిక్‌టాక్’ స్టారయ్యాడు
Follow us on

డ్యాన్స్ అంటే అతడికి ఇష్టం. ‘టిక్‌టాక్‌’ అంటే ఇంకా పిచ్చి. దీంతో తనకు వచ్చిన డ్యాన్స్‌ను చేస్తూ ‘టిక్‌టాక్‌’లో స్టార్‌ అయ్యాడు ఆ యువకుడు. అంతేకాదు డ్యాన్సులతో మెప్పించి ఏకంగా 40వేల ఫాలోవర్లను కూడా సంపాదించుకున్నాడు. అయితే బయట ఇతగాడు చేసే నిర్వాకం ఏంటో తెలుసా..! దొంగతనం. మీరు చదివేది నిజమేనండి. ఒకటి, రెండు కాదు ఇతగాడిపై ఆరు దొంగతనం కేసులు ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరిగాయి. వీటిని చేధించే పనిలో పడ్డ గ్రేటర్ నోయిడా ఆల్ఫా 2 ఏరియా పోలీసులకు ఓ గ్యాంగ్‌ మీద అనుమానం కలిగింది. వారి గురించి మొత్తం వివరాలను తెలుసుకున్న పోలీసులు.. ఈ దొంగతనాల్లో వారి హస్తం ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో షారూక్, అసిఫ్, ఫైజన్, ముఖేష్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ అనే ప్రాంతానికి చెందిన వీరు పలుచోట్ల దొంగతనాలు చేశారు. ఇక విచారణ సమయంలో తాము ఆరుచోట్ల దొంగతనాలు చేశామని ఈ నలుగురి గ్యాంగ్ ఒప్పుకుంది. దీంతో వారి వద్ద నుంచి ఫోన్లు, ఒక బైక్, కొంత డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే ఈ గ్యాంగ్‌కు షారూక్ ఖాన్(23) లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. దొంగతనాలు చేయాలనుకున్న ప్రాంతంలో షారూక్ రెక్కీ నిర్వహించి ప్రణాళికను రచిస్తే.. మిగిలిన వారు పోలీసులు రాకుండా ‘తగిన జాగ్రత్తలు’ తీసుకునే వారు. ఆ తరువాత వచ్చిన డబ్బును షారూక్ మిగిలిన వారికి పంచేవాడు. కాగా షారూక్ టిక్‌టాక్‌లో పెద్ద స్టార్. ఇతడికి 40వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘టిక్‌టాక్‌’ అంటే మోజు ఉండటం.. అందులో బాగా కనిపించాలని ఆరాటం ఉండటంతో షారూక్ దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.