Viral Video: వెంటాడి వేటాడింది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..

|

Jan 11, 2022 | 7:19 PM

అడవిలో సింహం, పులి, చిరుత వేటాడితే.. గాలిలో బలమైన డేగా హంటింగ్ దారుణంగా ఉంటుంది. అది టార్గె చేసిందంటే ఇక అంతే.. అది దేనినైనా ఎగురేసుకుపోతుంది. ఎంత

Viral Video: వెంటాడి వేటాడింది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..
White Hawk Eagle Attack
Follow us on

అడవిలో సింహం, పులి, చిరుత వేటాడితే.. గాలిలో బలమైన డేగా హంటింగ్ దారుణంగా ఉంటుంది. అది టార్గె చేసిందంటే ఇక అంతే.. అది దేనినైనా ఎగురేసుకుపోతుంది. ఎంత పెద్ద జంతువైన దాడి మాత్రం అదే స్థాయిలో ఉంటుంది. తన దాడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. డేగ దాని కళ్ళు, గోళ్ల బలంతో మాత్రమే వేటాడుతుంది. దాని టార్గెట్ ఎక్కడ దాక్కున్న దాడి చేయకుండా మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి పెరిగెత్తినా డేగ కన్నుల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దాని చూపు పడిన తర్వాత దానిని ఎవరూ రక్షించలేరు. మీరు నమ్మకపోతే తాజాగా వీడియోలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. ఈ వీడియో తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్  చేయబడింది.

ఈ వీడియోలో ఏం జరుగుతుంది?

ఈ వీడియో పావురాల కాశ్మీర్ పేరుతో ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేయబడింది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు ఎక్కడ రికార్డ్ చేశారన్నది మాత్రం తెలియరాలేదు. ఒక తెల్లటి డేగ నేలపై నడుస్తున్న కుందేలును చూసి దానిని ఎలా తరుముతుందో చూడవచ్చు. డేగ నుంచి తప్పించుకునేందుకు  కుందేలు చుట్టూ పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత కూడా డేగ దాడి నుంచి తప్పించుకోలేక పోయింది. చివరికి డేగ వేటకు చిక్కింది.

ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు డేగ వేటాడే తీరును ప్రశంసిస్తుంటే.. మరింకొందరు యూజర్లు మాత్రం ఇది దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోను ఇప్పటికే వేలాధి మంది చూసి లైక్ చేశారు. అంతే కాదు తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..