White Gyrfalcon world record: స్టేటస్ సింబల్ కోసం కొంతమంది తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి వారు ముందు వెనుక ఆలోచించకుండా.. వారి దగ్గరున్న డబ్బుతో వెంటనే నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే.. సౌదీకి చెందిన షేక్ అలాంటి స్టేటస్ సింబల్ కోసం 3.4 కోట్లు (£ 337,400 డాలర్లు) వెచ్చించి తెల్లని డేగను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని మల్హంలో భారీ ఎత్తున జరిగిన జరిగిన వేలంలో దీనికా రేటు పలికింది. అమెరికాకు చెందిన ఈ వైట్ గైర్ ఫాల్కన్ డేగ జాతుల్లో అతి పెద్దదని సౌదీ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వేలాన్ని ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్స్ ఆధ్వర్యంలో ఆదివారం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న మాల్‌హామ్‌లో నిర్వహించారు. ఈ వేలంలో పెద్దపెద్ద బిగ్‌షాట్స్ పాల్గొన్నారు. దీంతోపాటు ఈ వేలాన్ని స్థానిక టీవీల్లో, మీడియాలో లైవ్ ప్రసారం నిర్వహించారు.
అయితే.. సౌదీలో ఏళ్లుగా డేగలతో చిన్న జంతువులను వేటాడించే సంప్రదాయ ఆట పాల్కనరీ (రాజుల క్రీడ)ని ఏటా నిర్వహిస్తారు. అయితే.. దానిపై నిషేధం విధించిన అనంతరం 2019 ఫాల్కన్రీని నిర్వహించారు. కింగ్ అబ్దులాజీజ్ ఫాల్కనరీ ఫెస్టివల్ ఏటా డిసెంబర్‌లో రియాద్‌లో నిర్వహిస్తారు. ఈ ఆట 2019 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించింది. అప్పుడు 2,350 ఫాల్కన్‌లు హాజరయ్యాయి. ఇందుకోసమే అక్కడి ధనవంతులు ఈ వేటాడే పక్షులకు భారీ మొత్తాలు చెల్లించి కొంటుంటారు. అయితే.. ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదంటూ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రపంచ రికార్డని వెల్లడించాయి. ఈ ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్ ఆక్షన్‌లో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో.. ఫాల్కన్‌ను కలిగి ఉండటం స్టేటస్ సింబల్‌గా చూస్తుంటారు. ఇలాంటి పక్షులను సంపన్న వర్గాలు.. ఉన్నతవర్గాలకు బహుమతులుగా అందజేస్తుంటాయి. అయితే.. ఈ వైట్ గైర్‌ఫాల్కన్.. ఫాల్కన్ జాతులలో అతిపెద్దది. ఈ ఫాల్కన్‌లు తెలుపు, వెండి, గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి.
Also Read: