
కళ్లను మాయ చేయడమే కాదు.. మెదడుకు కూడా పదును పెడుతుంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. వీటిల్లో పైకి కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. అసలైనది ఎప్పుడూ కళ్లకు చిక్కదు. చాలామంది సైకాలజిస్టులు.. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, అంతర్గత లక్షణాలను తెలుసుకునేందుకు ఆప్టికల్ ఇల్యూషన్‌ను ఉపయోగిస్తారు. విజువల్ సెన్స్‌కు బదులుగా మీ మెదడుకు పని చెప్పే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఇంటర్నెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది.
పైన పేర్కొన్న ఫోటోలో నాలుగు ఎలిమెంట్స్ ఇమిడిపోయి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ విభిన్నం దృక్కోణాల్లో చూస్తారు. అక్కడ వారికి ఏం కనిపిస్తుందో.. అది వారి వ్యక్తిత్వాన్ని , స్వభావాన్ని అద్దం పడుతుందట. మెదడు ఏమి గ్రహిస్తుందో.. అది మనల్ని చూసేలా చేస్తుంది.. ఇక అదే మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
పైన ఫోటోలో చాలామంది మొదటిగా చెట్టును చూస్తారు. అలా చూసినవారు ప్రతీ విషయంలోనూ లాజికల్‌గా వ్యవహరిస్తారు. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారు.
గొరిల్లాను మొదటి చూసినవారు.. చాలా క్లిష్టమైన స్వభావం కలిగి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఈ వ్యక్తులు సమయాన్ని వృధా చెయ్యరు. ఎప్పుడూ ఏదొక పనిలో నిమగ్నమై ఉంటారు. వీరికున్న తెలివితేటల కారణం ఇతరులు.. ఈ వ్యక్తులను పెద్ద గుర్తించలేరు.
సింహాన్ని మొదటిగా చూసినవారు.. తమ కలలను నెరవేర్చుకునేందుకు అందరి కంటే భిన్నంగా ముందుకెళ్తారు. వీరి స్వభావం క్రూరంగా ఉంటుంది. దృఢ నిశ్చయంతో ఈ వ్యక్తులు ఎలప్పుడూ కష్టపడుతూ తమ లక్ష్యాలను సాధిస్తారు. సెన్సిబిలిటీ విషయంలో వీరిలో కొంచెం భిన్నత్వం కనిపిస్తుంది.
మొదటిగా చేపలను చూసినవారు.. తమ రిలేషన్‌షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అది బీటలు వారకుండా చూసుకుంటారు. అలాగే ఇతరులు అసహ్యించుకుంటే.. వీరికి అస్సలు నచ్చదు.
Which You See First In This Image @WhatsTrending @TrendingWeibo @TheViralFever @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/SRLaeFAfbP
— telugufunworld (@telugufunworld) April 21, 2022