AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

మనసులో ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్ తల్లిని ఆశ్రయించడం మనకు అలవాటే. అయితే ఈ 2026లో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు గూగుల్‌లో అత్యధికంగా వెతికిన ప్రశ్నల జాబితా ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రముఖ అనలిటిక్స్ సంస్థ SEMrush విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో.. ఒకే ఒక్క ప్రశ్నకు నెలకు ఏకంగా 13.6 మిలియన్ల సెర్చెస్ వచ్చాయి. ఆ ప్రశ్నల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..
Google Search Trends 2026
Krishna S
|

Updated on: May 21, 2026 | 6:57 PM

Share

మనిషి అన్నాక సందేహాలు రావడం సహజం. అది చిన్నదైనా, పెద్దదైనా.. సమాధానం దొరికే వరకు మనసు కుదురుగా ఉండదు. మరి ఈ డిజిటల్ యుగంలో మనకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది గూగుల్ తల్లి. ప్రతి సంవత్సరంలాగే ఈ 2026లో కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమకు వచ్చిన చిత్రవిచిత్రమైన ప్రశ్నలను గూగుల్ వేదికగా శోధించారు. తాజాగా డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ సంస్థ SEMrush విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా విద్య, క్రీడలు, టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్ అంశాలపై తెగ వెతికేశారు. అయితే ఈ జాబితాలో టాప్ స్థానాల్లో నిలిచిన కొన్ని ప్రశ్నలు మాత్రం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

టాప్ ప్లేస్‌లో భారతీయ చాయ్ హిస్టరీ

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన ప్రశ్నలలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది మన దేశానికి సంబంధించిన ప్రశ్నే కావడం విశేషం. “భారతదేశంలో తేయాకు ఆవిష్కరణ వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? (What is the legend behind the discovery of tea in India?) అనే ప్రశ్న కోసం నెటిజన్లు ప్రతి నెలా సుమారు 13.6 మిలియన్ల సార్లు వెతికారు. భారతీయ సంప్రదాయాలు, తేయాకు చరిత్ర, బౌద్ధ సన్యాసుల కథల పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో నానాటికీ ఆసక్తి పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సైన్స్, మ్యాథ్స్ ప్రశ్నలకు ఫుల్ డిమాండ్

రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రశ్నగా “తల్లి నుండి బిడ్డకు లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి?” నిలిచింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా జన్యుశాస్త్రం, వారసత్వ ప్రవర్తనా లక్షణాల గురించి తెలుసుకోవడానికి గూగుల్‌ను ఆశ్రయించారు. మరోవైపు విద్యా రంగానికి సంబంధించి.. ఫ్యాక్టర్స్ ఆఫ్ 100 ? అనే గణిత ప్రశ్న కూడా టాప్ 10 జాబితాలో చేరింది. కోడింగ్, ప్రోగ్రామింగ్, ఉన్నత గణితశాస్త్రం అభ్యసించే విద్యార్థులు ఈ ప్రశ్నను ఎక్కువగా సెర్చ్ చేశారని నివేదిక వెల్లడించింది.

పోటీ పరీక్షలు.. గేమింగ్ హడావుడి

భారత భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన “కింది వాటిలో ఏది కేంద్రపాలిత ప్రాంతం కాదు?” అనే ప్రశ్న కూడా గూగుల్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మనదేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ సెర్చ్ ట్రెండే నిదర్శనం. వీటితో పాటు 2026లో ఆన్‌లైన్ గేమింగ్ హవా నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఈ క్రమంలోనే టెక్నాలజీ విభాగంలో “నా IP అడ్రస్ ఏమిటి?” అనే ప్రశ్న టాప్-10 లో చోటు సంపాదించుకుంది. కేవలం టెక్ నిపుణులే కాకుండా సాధారణ సైబర్ యూజర్లు సైతం తమ నెట్‌వర్క్ భద్రత, సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకుంటున్నారని దీనిబట్టి అర్థమవుతోంది.

2026 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. ప్రజల ఆలోచనలు, ఆసక్తులు ఎంత వేగంగా మారుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. టైంపాస్ ముచ్చట్లు, సెలబ్రిటీ గాసిప్స్ మాత్రమే కాదు.. విద్య, సాంకేతికత, సరికొత్త డిజిటల్ సేవలు, సాధారణ జ్ఞానం వంటి సీరియస్ అంశాలపై కూడా నెటిజన్లు విపరీతమైన శ్రద్ధ చూపిస్తున్నారు.

Follow Us