
వివాహ వేడుకల్లో భాగంగా కొంతమంది కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. పెళ్లి వేడుకల్లో.. వధువు తమ్ముళ్లు, చెల్లెళ్లు, వరుడి బూట్లను దాచి పెట్టి, అప్పగింతల సమయంలో డబ్బులు డిమాండ్ చేసే వింత ఆచారం కూడా ఒకటి ఉంది. ఇది సరదాగా చేస్తుంటారు. బావను ఆటపట్టించేందుకు చేసే పని. కానీ, సరదాగా చేసే ఈ ఆచారం ఓ పెళ్లిలో తీవ్ర వివాదానికి దారి తీసి ఏకంగా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన పెళ్లి వేడుకల్లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు చెందిన ముహమ్మద్ షబీర్ శనివారం తన కుటుంబంతో బిజ్నోర్ చేరుకున్నాడు.
ఈ క్రమంలో వధువు చెల్లెలు వరుడి బూట్లను ‘జూతా చుపాయి’ ఆచారంలో భాగంగా దాడి పెట్టింది. ఆ తర్వాత బూట్లు ఇవ్వాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ, పెళ్లి కొడుకు షబీర్ కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. రూ.50 వేలు అడిగితే.. రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు.. వీడెక్కడి బికారి(బిచ్చగాడు) అంటూ వధువు తరపు వాళ్లు నోరు పారేసుకున్నారు. అది విని వరుడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు షబీర్‌ను ఓ రూమ్‌లో వేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకొని, ఇరు వర్గాల వారిని శాంతిపజేశారు.
ఆ తర్వాత ఈ ఘటనపై ఇరు కుటుంబాలు బిజ్నోర్‌లోని నాజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పెళ్లి కొడుకు కుటుంబం డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుందని, పెళ్లి కూతురు ముఖ్యమా? డబ్బు ముఖ్యమా అని అడిగితే తమకు డబ్బే ముఖ్యమని పెళ్లి కొడుకు చెప్పాడని, అలాగే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు తాము పెట్టిన బంగారం నాణ్యతపై తమతో గొడవకు దిగారంటూ వధువు తరఫు వాళ్లు పోలీసులకు వెల్లడించారు. ఆ తర్వాత వరుడి తరఫు వాళ్లు వాళ్ల వాదన వాళ్లు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న పోలీసులు వారికి నచ్చజెప్పి.. రాజీ కుదిర్చారు. మొత్తానికి జూతా చుపాయి అనే ఆచారం ఇంతకీ తీసుకొచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.