150 ఏళ్ల చెట్టు నుంచి ఏకదాటిగా వస్తున్న నీటి ప్రవాహం.. అద్భుత చెట్టు వీడియో వైరల్..

|

Nov 21, 2023 | 7:43 PM

వైరల్ వీడియోలో చెట్టు నుండి నీరు కిందకు ట్యాప్‌ నుంచి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చెట్టు నుండి ఉద్భవించిన ఈ ఫౌంటెన్‌ని చూసేందుకు చాలా మంది ఇక్కడికి క్యూ కట్టారు.. భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న చెట్టు నుండి నీరు దారళంగా ప్రవహిస్తుంది. స్థానిక నివాసి అమీర్ హక్రామాజ్ అనే యూజర్ ఈ వింత చెట్టు వీడియోని పోస్ట్ చేశారు. అతని పోస్ట్‌లో ఇది ఒక అందమైన, అరుదైన దృశ్యంగా అభివర్ణించారు.

150 ఏళ్ల చెట్టు నుంచి ఏకదాటిగా వస్తున్న నీటి ప్రవాహం.. అద్భుత చెట్టు వీడియో వైరల్..
Mulberry Tree
Follow us on

ప్రకృతి ఎల్లప్పుడూ మానవులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. మనిషిని ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలు ఈ ప్రపంచంలో అన్ని మూలల దాగి ఉన్నాయి. ప్రకృతి ప్రతిచోటా అద్భుతాలను దాచిపెడుతుంది. ఆ విధంగా దక్షిణ ఐరోపాలోని ఓ వింత చెట్టుకు సంబంధించిన వీడియో వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 150 సంవత్సరాల నాటి మల్బరీ చెట్టు నుండి ఒక మీటరు ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వింత చెట్టు వీడియో చూసిన నెటిజన్లు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఆశ్చర్యకరమైన కామెంట్స్‌తో వీడియోని మరింత వైరల్‌ చేస్తున్నారు.

మోంటెనెగ్రోలోని డైనోసా గ్రామంలో మల్బరీ చెట్టు కనిపించింది. కానీ ఈ చెట్టు నుండి వింతగా నీటి ప్రవాహం ఉద్భవించింది. ఇది ప్రవాహం ఏడాది పొడవునా కాకుండా సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఈ చెట్టు నుండి ఏకధాటికి నీటి ప్రవాహం కనిపిస్తుందని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఆ వింత చెట్టు రంధ్రం నుండి ఒక ఫౌంటెన్‌లా నీటి దారా కనిపిస్తుంది. ఈ వీడియోను సైన్స్ గర్ల్ ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంకా వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌లో ఇలా ఉంది. మాంటెనెగ్రోలోని డైనోసా గ్రామంలో సుమారు 150 సంవత్సరాల వయస్సు గల మల్బరీ చెట్టు ఉంది. 1990ల నుంచి ఈ చెట్టు నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇది భూగర్భ ప్రవాహాలను కలుపుతుంది. అయితే, భారీ వర్షాల తర్వాత ఏర్పడే ఒత్తిడికి చెట్టు ట్రంక్ ఒక పైప్‌లైన్‌గా మారి వాటర్‌ ఫ్లో తన్నుకు వస్తుందని చెబుతున్నారు.

వైరల్ వీడియోలో చెట్టు నుండి నీరు కిందకు ట్యాప్‌ నుంచి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చెట్టు నుండి ఉద్భవించిన ఈ ఫౌంటెన్‌ని చూసేందుకు చాలా మంది ఇక్కడికి క్యూ కట్టారు.. భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న చెట్టు నుండి నీరు దారళంగా ప్రవహిస్తుంది. స్థానిక నివాసి అమీర్ హక్రామాజ్ అనే యూజర్ ఈ వింత చెట్టు వీడియోని పోస్ట్ చేశారు. అతని పోస్ట్‌లో ఇది ఒక అందమైన, అరుదైన దృశ్యంగా అభివర్ణించారు.

మంచు కరిగిన తర్వాత లేదా భారీ వర్షాల తర్వాత భూగర్భ నీటినిల్వలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతాయి. ఈ ఒత్తిడి చెట్టు బోలు భాగం ద్వారా నీరు పైకి లేస్తుంది. అది చెట్టులోని ఖాళీ ప్రదేశం గుండా బయటకు వస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఇది అద్భుతమైన సహజ దృగ్విషయం!” అంటూ మరోక వినియోగదారు పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటికే 18 మిలియన్ల మంది వీక్షించారు. టర్కీలోని యాకాపార్క్ ట్రౌట్ ఫామ్‌లో చెట్టు నుండి నీరు పోస్తున్న ఫోటోను కూడా చాలా మంది షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..