Video Viral: కుంచెతో గీసిన చిత్రం కాదండోయ్.. ప్రకృతితో పెనవేసుకున్న అద్భుత దృశ్యం.. మనసు దోచుకుంటున్న వీడియో

|

Aug 18, 2022 | 6:34 AM

ప్రకృతి (Nature) చాలా అందమైనది. ఈ భూమిపై ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, పొడవాటి నదులు, అందమైన జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇటువంటి అందమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి....

Video Viral: కుంచెతో గీసిన చిత్రం కాదండోయ్.. ప్రకృతితో పెనవేసుకున్న అద్భుత దృశ్యం.. మనసు దోచుకుంటున్న వీడియో
Waterfall
Follow us on

ప్రకృతి (Nature) చాలా అందమైనది. ఈ భూమిపై ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, పొడవాటి నదులు, అందమైన జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇటువంటి అందమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెళ్లాలని ప్రకృతి ప్రేమికులు కలలుకంటూ ఉంటారు. భారతదేశంలోని దూద్‌సాగర్ జలపాతం, అమెరికాలోని నయాగరా జలపాతంతో సహా ప్రపంచంలోని జలపాతాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న జలపాతం వీడియో నెటిజన్లు మనసు దోచుకుంటోంది. పర్వతం పై నుంచి నీరు కిందికి దూకుతున్నప్పుడు ఆ ప్రవాహ మార్గం అచ్చం తెల్ల గౌనులో మెరిసిపోతున్న యువతిని తలపిస్తోంది. జలపాతం పై భాగం తలగా అనుకుంటే మిగతా ప్రవాహం అంతా తెల్లగా మెరిసిపోతున్న గౌనులా కనిపిస్తుంది. అందుకే ఈ జలపాతాన్ని ‘వధువు జలపాతం’ అని పిలుస్తున్నారు. ఇది పెరూలో ఉంది.

ఈ అద్భుతమైన జలపాతం వీడియో @wowinteresting8 అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 52 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఒక లక్షా 14 వేల మందికి పైగా నెటిజన్లు వీడియోను లైక్ చేశారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి