
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏం జరిగిందో చూస్తే మీరు నమ్మలేరు. బైక్ నడుపుతున్న తన భర్తను ఒక మహిళ చెప్పుతో కొడుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న మహిళ అకస్మాత్తుగా తన చెప్పును చేతిలోకి తీసుకుని బైక్ నడుపుతున్న వ్యక్తిని చెడామడా వాయించేసింది. చేతిలో ఉన్న చెప్పుతో భర్తను చితకొట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి ఏమీ ఎరగనట్టుగానే ప్రశాంతంగా బైక్ నడుపుతున్నాడు. భార్య కోపంగా చెప్పుతో కొట్టిన కూడా అతడు ఏ మాత్రం కోపం గానీ, బాధను కానీ చూపించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
వైరల్ వీడియోలో బైక్ నడుపుతున్న తన భర్తను ఒక మహిళ చెప్పుతో కొడుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుండి వచ్చినట్టుగా తెలిసింది. ఈ వీడియోలో బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న మహిళ అకస్మాత్తుగా తన చెప్పును చేతిలోకి తీసుకుని తన భర్తను దానితో కొట్టడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి ఏ మాత్రం స్పందించకుండా ప్రశాంతంగా ఉన్నాడు. భార్య కోపంగా చెప్పుతో కొడుతున్నా అతడు ఎలాంటి చలనం లేకుండా ఏమాత్రం బాధ కూడా లేకుండా ఉన్నాడు. అలా బైక్ ముందుకు నడుపుతూనే ఉన్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
Kalesh b/w Husband and wife on running bike, Wife started beating her husband over some mutual dispute In Lucknow UP pic.twitter.com/7Nay1x9tgi
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 20, 2025
అయితే, నెట్టింట వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించారు. వీరు చేసిన పని పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కొందరు అంటుంటే.. వారిద్దరూ హెల్మెట్ ధరించలేదని మరికొందరు అంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ఇకపోతే, ఈ వీడియో 4 లక్షలకు పైగా వ్యూస్‌తో నెట్టింట చక్కర్లు కొడుతూ తీవ్ర చర్చకు దారితీసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..