Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..

|

Jan 02, 2022 | 4:47 PM

సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు తెగ సందడి చేస్తున్నాయి. వాటి విచిత్రమైన ఆట.. పాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలు

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..
Michael Jackson Moonwalk
Follow us on

సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు తెగ సందడి చేస్తున్నాయి. వాటి విచిత్రమైన ఆట.. పాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. చాలాసార్లు ముచ్చటేస్తుంటాయి. ఇవాళ అలాంటి వీడియో ఒకటి సందడి చేస్తోంది. ఇది మీ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఇటీవల, ఒక పావురం వీడియో బయటపడింది. అందులో అది అచ్చు మైఖేల్ జాక్సన్ లా స్టెప్పులు వేయడం మీరు చూడవచ్చు.

జంతు ప్రేమికులకు సోషల్ మీడియా ఓ వరం అని చెప్పాలి. ఎందుకంటే అందులో వచ్చే ఫోటోలు, వీడియోలు వారికి విపరీతంగా ఆకట్టుకుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువుల నృత్యాన్ని మనందరం చాలాసార్లు చూసి ఉంటాం. శిక్షణ తర్వాత జంతువులు ప్రదర్శించే అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో కూడా ఉన్నాయి. అయితే పావురం డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? అంటే ఎప్పుడూ చూసి ఉండలేదనే జవాబు వస్తుంది. అయితే అలాంటి వీడియో సోషల్ మీడియాలో కూడా అందుబాటులోకి వచ్చింది.

వైరల్ అవుతున్న వీడియోలో పావురంపై కెమెరా పడగానే అది డ్యాన్స్ చేయడం ప్రారంభించడాన్ని మీరు చూడవచ్చు. ఆ మధ్య కాకి డ్యాన్స్ చేయడం చూసిన మనం అమ్మో..! అని తెగ మురిసి పోయాం. కానీ ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో స్టెప్పులేసింది ఓ పావురం.  అతను ఒక్క సెకనులో తన వేగాన్ని పుంజుకుంది. మైఖేల్ జాక్సన్ చేసిన మూన్‌వాక్‌ గుర్తు చేసింది.

ఈ వీడియో చూడండి


సోషల్ మీడియాలో ఈ వీడియోకు బాగా లైక్ చేస్తున్నారు. ప్రజలు దానిని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడమే కాకుండా దానిపై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. మీ సమాచారం కోసం ఈ వీడియో Instagramలో funanimalvids అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడిందని మీకు తెలియజేద్దాం. దానితో ఫన్నీ క్యాప్షన్ కూడా రాశాడు..! ఈ వీడియోకు వార్తలు రాసే వరకు 60 వేలకు పైగా వీక్షణలు రాగా ఈ వీడియోకు లక్షల్లో లైక్‌లు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి: KTR: ఆదిలాబాద్‌లో సీసీఐను పున:ప్రారంభించండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు