చేపలు అనేక జాతులు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రం మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. మరికొన్ని మాత్రం సముద్రపు నీటి అడుగున ఉంటాయి. మరి అప్పుడప్పుడూ అలాంటివి నీటిపైన కనిపిస్తే.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో ఓసారి లుక్కేద్దాం పదండి..
వైరల్ వీడియో ప్రకారం.. ఒక సరస్సులో తల లేని చేప ఈదుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇంతకీ దానికి నిజంగానే తల లేదా.? లేక ఆ చేప అంతేనా.? అనేది తెలియదు గానీ.. అది మాత్రం నీటిలో చకచకా ఈదేస్తోంది. ఎప్పుడూ కూడా చేపలు తమ నాడీ వ్యవస్థలోని ఓ చిన్న పార్ట్‌ను ఉద్దీపనలకు ప్రతిస్పందించడానికి వీలుగా ఉంచుతాయన్నది ఓ థియరీ అయితే.. నరాలు కదలికలు ద్వారా తల లేకపోయినా కొన్ని చేపలు చాలా ఈజీగా ఈదగలుగుతాయన్నది మరో థియరీ. ఇక ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ట్విట్టర్‌లో దీనికి మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.
A Headless Fish casually swimming around in the Lake. ? pic.twitter.com/T3DpGdoL6I
— Wall Street Silver (@WallStreetSilv) January 7, 2023