బెంగళూరు, డిసెంబర్ 25: స్కూల్ బస్సు టైరుకి గాలి నింపుతుండగా చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మెకానిక్ అమాంతం గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడి సమీపంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉడిపి జిల్లా మంగళూరులోని జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ వాహన టైరు పంక్చర్ షాపు ఉంది. అక్కడ అబ్దుల్ రజీద్ (19) అనే యువకుడు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఓ ప్రవేట్ స్కూల్ బస్సు టైర్‌కు పంక్చర్ కావడంతో ఈ షాప్ వద్దకు వచ్చింది. దీంతో మెకానిక్ అబ్దుల్ ఆ స్కూల్ బస్సు టైర్‌కు రిపేర్ చేయడం ప్రారంభించాడు. బస్సు టైర్‌ను ప్యాచింగ్ వర్క్ పూర్తయ్యాక, టైర్‌కి గాలి నింపుతుండగా అది ఒక్కసారిగా పేలింది. అదే సమయంలో అక్కడ నుంచి వెనుకకు తిరిగిన అబ్దుల్ ఏదో పరికరం కోసం వెతుకుతుండగా టైర్ పేలింది.
𝕂𝔸ℝℕ𝔸𝕋𝔸𝕂𝔸 | A horrific incident occurred in Udupi, Karnataka, leaving onlookers stunned. A mechanic, Abdul Razid, 19, was repairing a puncture on a private school bus’s tyre when it suddenly burst. The impact was so severe that Abdul was thrown into the air, landing… pic.twitter.com/ancowhRYK6
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 23, 2024
దీంతో అబ్దుల్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. పక్కనే ఉన్న ఇనుప వస్తువులపై పడటంతో అబ్దుల్ తలకు బలమైన గాయమైంది. దీంతో అతడిని మంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ దృశ్యాలు సమీపంలోని మరో షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కెమెరా రికార్డింగ్ సంఘటన తేదీని బట్టి డిసెంబర్ 21గా తెలుస్తోంది.