Viral Video: దేశీ జుగాడ్‌ అంటే మజాక్‌ కాదు భయ్యా..! రోడ్డు రోలర్‌ని కూడా ఎత్తేస్తారు.. వీడియో చూస్తే అవాక్కే…!

|

Aug 31, 2023 | 8:34 PM

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డు రోలర్‌ను ఎత్తైన రోడ్డుపైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆ రోడ్డు బాగా ఎత్తుగా నిటారుగా ఉంది. దీంతో రోడ్డు రోలర్ పైకి ఎక్కడం లేదు. కానీ, అందరూ కలిసి ఏదో జుగాడ్ చేయాలనుకున్నారు.. అందరూ కలిసి దాన్ని పైకి నెట్టేందుకు ప్రయత్నించారు. రోడ్డు రోలర్ చక్రాన్ని బలంగా ముందుకు నెడుతున్నారు. వారు చేసిన ప్రయత్నం కాస్త ఫలించింది.. రోడ్డు రోలర్ కొంచెం ముందుకు కదులుతుంది. కానీ,

Viral Video: దేశీ జుగాడ్‌ అంటే మజాక్‌ కాదు భయ్యా..! రోడ్డు రోలర్‌ని కూడా ఎత్తేస్తారు.. వీడియో చూస్తే అవాక్కే...!
Road Rollar
Follow us on

రోడ్ రోలర్.. ఈ వెహికిల్‌ అందరికీ తెలిసిందే.. రహదారి నిర్మాణం నుండి భూమిని చదును చేసే వరకు దీనిని ఉపయోగిస్తారు. ఇది చాలా భారీ వాహనం. దీని వేగం తాబేలుకంటే కూడా తక్కువనే చెప్పాలి. అలాగే దీని చక్రాలు కూడా చాలా బలంగా, గుండ్రంగా, రోడ్డుపై సాఫీగా ప్రయాణించేందుకు స్మూత్‌గా ఉంటాయి. ఎలాంటి పట్టు ఉండదు. అందువల్ల ఈ వాహనాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాల్సి వచ్చినప్పుడు దాని కోసం మరొక యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎదుకంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు వ్యక్తులు రోడ్డు రోలర్‌ను ఎత్తుకు ఎక్కించేందుకు తోసుకుంటూ వస్తున్నారు. రోడ్డు రోలర్‌ను పైకి లేపడానికి ప్రజలు దానిని నెడుతున్నారు. అదేదో కారు, బస్సును నెడుతున్నట్టుగా రోడ్డు రోలర్‌ను నెడుతున్నారు.. కానీ, అది చాలా బరువైనది కావటంతో… అది ముందుకు వెళ్లడానికి బదులుగా వెనుకకు వెళుతుంది. ఇది చూసి జుగాద్ తెలివితేటలు అన్ని చోట్లా పనికిరావంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డు రోలర్‌ను ఎత్తైన రోడ్డుపైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆ రోడ్డు బాగా ఎత్తుగా నిటారుగా ఉంది. దీంతో రోడ్డు రోలర్ పైకి ఎక్కడం లేదు. కానీ, అందరూ కలిసి ఏదో జుగాడ్ చేయాలనుకున్నారు.. అందరూ కలిసి దాన్ని పైకి నెట్టేందుకు ప్రయత్నించారు. రోడ్డు రోలర్ చక్రాన్ని బలంగా ముందుకు నెడుతున్నారు. వారు చేసిన ప్రయత్నం కాస్త ఫలించింది.. రోడ్డు రోలర్ కొంచెం ముందుకు కదులుతుంది. కానీ, చివరికి ఆ భారీ వాహనం జారి కిందకు పరుగులు పెట్టింది. దాంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. దాంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఈ వీడియో ఆగస్ట్ 4న ఇన్‌స్టాగ్రామ్ పేజీ @infotekniksipil లో షేర్‌ చేయగా,.. దీనిని సోషల్ మీడియా యూజర్స్‌ విపరీతంగా వీక్షించారు. ఇప్పటి వరకు ఈ క్లిప్‌కి 60 లక్షల వీక్షణలు, 2.5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు. .

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..