ప్రస్తుతమంతా ఇంటర్నెట్ యుగమే నడుస్తోంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మొబైల్ వినియోగిస్తుండటంతో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ఇక ప్రపంచంలో నలుమూలల జరిగే ఏ విషయమైనా క్షణాల్లో నెట్టింట దర్శనమిస్తున్నాయ్. తాజాగా ఓ జంటకు సంబంధించిన హనీమూన్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.?
వైరల్ వీడియో ప్రకారం.. కొత్తగా పెళ్ళైన ఓ జంట హనీమూన్ కోసం ఒక రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ వరుడు తన భార్యను సర్‌ప్రైజ్ చేసేందుకు స్విమ్మింగ్ పూల్ నిండా గులాబీ పూలు నింపేస్తాడు. ఇక ఆ తర్వాత సర్‌ప్రైజ్‌ను భార్యకు చూపించడం.. ఆమె ఎంతగానో హ్యాపీ ఫీల్ కావడం.. ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇదొక కొత్త ట్రెండ్ అని అంటుంటే.. ఇంకొందరు వారిని తిట్టిపోస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.