Viral Video: నువ్ మనిషివా.. మ్యాన్‌హోల్‌వా.. పురుగులతో బర్గర్ ఏంట్రా సామీ.. వీడియో చూస్తే

|

Jun 12, 2024 | 2:07 PM

ప్రస్తుతమంతా డిజిటల్ ప్రపంచమే రాజ్యమేలుతోంది. ప్రపంచం నలువైపులా ఏం జరుగుతున్నా.. చిటికె‌లో సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెగ వైరల్ అవుతోంది. ఇక చాలామంది తమ విచిత్ర వంటకాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి..

Viral Video: నువ్ మనిషివా.. మ్యాన్‌హోల్‌వా.. పురుగులతో బర్గర్ ఏంట్రా సామీ.. వీడియో చూస్తే
Viral Video
Follow us on

ప్రస్తుతమంతా డిజిటల్ ప్రపంచమే రాజ్యమేలుతోంది. ప్రపంచం నలువైపులా ఏం జరుగుతున్నా.. చిటికె‌లో సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెగ వైరల్ అవుతోంది. ఇక చాలామంది తమ విచిత్ర వంటకాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి ఓ వెరైటీ ఫుడ్‌కు సంబంధించిన వీడియో జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక అందులో చైనాకు చెందిన ఓ వ్యక్తి పురుగులతో నిండిన బర్గర్‌ను ఎంతో ఇష్టంగా లాగించేస్తున్నాడు.

ఈ వైరల్ వీడియోను ‘eaters.cn’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బర్గర్ తింటున్నాడు. ఇక అతడి ముందు ఉన్న ప్లేట్‌లో పురుగులు ఉండగా.. వాటిని ఇంచక్కా తన బర్గర్‌లో నింపుకుని మరీ ఆరగించాడు సదరు వ్యక్తి. ఈ వీడియో చూసి జనాలు బిత్తరపోయారు. అదేం టేస్ట్ రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ ఫుడ్ చూస్తుంటేనే వికారం వేస్తోందని తిట్టుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి