
సాధారణంగా బైక్ లేదా కారు నడపడం అనేది చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ వాటిని డ్రైవ్ చేయడం వెనుక చాలా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే.. అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం చాలా కష్టం అని కొందరు భావిస్తుంటారు. అలాగే యువతులు బండి నడిపే వీడియోలు కూడా కొన్ని ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. వారి డ్రైవింగ్ చూసి చాలామంది భయపడతారు. ఇక సరిగ్గా దీనికి అడ్డం పట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. మీరు కూడా దాన్ని చూసి కచ్చితంగా షాక్ కావడం ఖాయం.
వీడియో ప్రకారం.. ఓ కాలేజీ గ్రౌండ్‌లో ఒక అమ్మాయికి బైక్ నడపడం నేర్పుతాడు ఓ యువకుడు. ఆ అమ్మాయి ముందు కూర్చుంటే.. వెనుక అతడు కూర్చుని ఎలా నడపాలో చెబుతుంటాడు. కొద్ది దూరం ఇద్దరూ కలిసి మెల్లిగానే వాహనాన్ని నడుపుతారు. సరిగ్గా ఇప్పుడే కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ యువతి బ్రేక్‌కు బదులుగా స్కూటీ ఎక్సలేటర్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది. అంతే! ఆ బండి రెండు మూడు వంకర్లు తిరుగుతుంది.. యువకుడు దాన్ని కంట్రోల్ చేసేందుకు ఎంతలా ప్రయత్నించా.. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. చివరికి ఇద్దరూ కలిసి బొక్కబొర్లా పడ్డారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంత ఈజీ కాదు బ్రో’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఇలాంటివి చూసినప్పుడే బండి నడిపే అమ్మాయిలు చూస్తే భయమేస్తుంది’ అని ఇంకొకరు.. ‘అమ్మాయిలతో అట్టుంటది బ్రో’ అంటూ వేరొకరు కామెంట్లు పెట్టారు.