Viral Video: పెట్రోల్ కొట్టిద్దామని కారును బంక్‌లోకి పోనిచ్చాడు.. బానెట్ ఓపెన్ చేసి చూడగా..

|

Jun 11, 2024 | 5:58 PM

అది ఆదివారం. ఓ వ్యక్తి పెట్రోల్ కొట్టించేందుకు షెడ్‌లో ఉన్న తన కారును బయటకు తీసి.. స్థానికంగా ఉండే బంకుకు తీసుకెళ్లాడు. ఇక అక్కడ పెట్రోల్ కొట్టిస్తుండగా.. కారులో నుంచి ఏవో వింత శబ్దాలు విన్నాడు. ఏమై ఉంటాయని బానెట్ ఓపెన్ చేసి చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా..

Viral Video: పెట్రోల్ కొట్టిద్దామని కారును బంక్‌లోకి పోనిచ్చాడు.. బానెట్ ఓపెన్ చేసి చూడగా..
Petrol Bunk
Follow us on

అది ఆదివారం. ఓ వ్యక్తి పెట్రోల్ కొట్టించేందుకు షెడ్‌లో ఉన్న తన కారును బయటకు తీసి.. స్థానికంగా ఉండే బంకుకు తీసుకెళ్లాడు. ఇక అక్కడ పెట్రోల్ కొట్టిస్తుండగా.. కారులో నుంచి ఏవో వింత శబ్దాలు విన్నాడు. ఏమై ఉంటాయని బానెట్ ఓపెన్ చేసి చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ కారు బానెట్ ఓ కోడి తన ఆవాసాన్ని యేర్పరుచుకుంది. అలాగే దానితో పాటు కొన్ని గుడ్లు కూడా ఉన్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అదొక పాత మోడల్ కారు.. స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. పెట్రోల్ కొట్టిస్తుండగా ఏవో వింత శబ్దాలు విని.. కారు ముందు భాగాన్ని ఓపెన్ చేశాడు. ఇక లోపల చూస్తే.. వారికి షాక్ ఇస్తూ ఓ కోడి తన ఆవాసాన్ని ఏర్పరుచుకుంది. అక్కడ బంక్‌లో ఉన్న ఇతర వ్యక్తుల సాయంతో కారు ఓనర్ ఆ కోడిని, గుడ్లను బయటకు తీశాడు. షెడ్ నుంచి కారును బయటకు తీసి ఎక్కువ రోజులు కావడంతో.. కోడి బానెట్‌ లోపలికి చేరినట్టు ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కోట్లలో వ్యూస్ వచ్చిపడుతుండగా.. నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: వామ్మో.. ఇదేం ఏసీ భయ్యా.! ఆన్ చేస్తే చాలు.. అటు చల్లదనం, ఇటు వెచ్చదనం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి