క్రూర జంతువులు మనకు దగ్గరగా వస్తే.. గుండె ఆగినంత పనవుతుంది. కొందరైతే దెబ్బకు అక్కడ నుంచి పరుగులు పెడతారు. అయితే ఇక్కడ ఇంకొందరు తాము ఎదుర్కున్న ఆ క్షణాలను ప్రపంచమంతా తెలిసేలా కెమెరాలతో బంధిస్తారు. సింహం, చిరుత, పులి లాంటి ప్రిడెటర్లతో పోలిస్తే.. ఎలిగేటర్లు, మొసళ్లు అనుకున్నంత భయాన్ని కలిగించవు. కానీ కొన్నిసార్లు వాటి పరిమాణం, ప్రదేశం ఆధారంగా భయపడాల్సిన సందర్భాలు లేకపోలేదు.
తాజాగా ఓ మొసలికి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి.. అనుకోని అతిధిలా పలకరించింది ఓ పెద్ద మొసలి. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల టామీ లీ అనే వ్యక్తి ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నాడు. అతడు దగ్గరలో ఉన్న చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లగా.. అక్కడ భారీ సైజ్ మొసలి ఒకటి అనుకోని అతిధిలా పలకరించింది.దాన్ని చూసిన వెంటనే ఇతగాడు ‘వెనక్కి వెళ్లు’ అని చెప్పగా.. అది పరుగు పరుగున అతడిపైకి దాడి చేసేందుకు దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
This man narrowly escaped an encounter with an alligator in Florida ? pic.twitter.com/uWtk5auaWO
— NowThis (@nowthisnews) September 13, 2022