భూమిపై వందలాది జాతుల జంతువులు ఉన్నప్పటికీ.. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి. సింహం, పులి, చిరుత, హైనా.. లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. ఇక నీటిలో నివసించే జంతువుల గురించి మాట్లాడితే.. అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అని అనుకుంటే.. మొసళ్లు మొదట గుర్తొస్తాయి. వీటిని ‘సముద్రపు అలెగ్జాండర్స్’ అని పిలుస్తారు. నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. తనకంటే భారీగా ఉండే జంతువు దేనినైనా సరే.. క్షణాల్లో మట్టుబడుతుంది. ఇతర జంతువులే మొసళ్లతో తలబడలేవు. అలాంటిది మనిషి.. మొసళ్ళతో తలబడగలడా.? తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూస్తే మీ గుండె గుభేల్ అంటది.
మనం వెళ్లే మార్గం మధ్యలో మొసలి తారసపడితే.. దాన్ని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారా.? ఇదేం పిచ్చి ప్రశ్న. ప్రాణాలు పోతాయి అని అంటారు. అవును కదా.! మొసలిని దాటివెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. అలాంటిది ఓ వ్యక్తి కుప్పలు తెప్పలుగా మొసళ్లు నిండి ఉన్న సరస్సులో పడవతో బోటింగ్ చేశాడు.
వైరల్ వీడియో ప్రకారం.. అటవీ ప్రాంతం గుండా ఉన్న ఓ సరస్సులో ఓ వ్యక్తి పడవతో బోటింగ్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. మొదటి ఫ్రేమ్‌లో చూసినప్పుడు మీరు అది మాములు సరస్సే కదా అని అనుకోవచ్చు.. అయితే కొన్ని ఫ్రేమ్స్ దాటితే.. మీకు కుప్పలు తెప్పలుగా మొసళ్లు కనిపిస్తాయి. అవును కరెక్టే.. కుప్పలు తెప్పలుగా మొసళ్లతో నిండిన సరస్సులో ఆ వ్యక్తి పడవతో బోటింగ్ చేస్తున్నాడు. అంతేకాదు దానంతటిని వీడియో తీస్తున్నాడు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. ఆ మొసళ్ళను మనోడు మోటర్ బోట్‌తో చంపేస్తున్నాడని చెప్పాలి. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియో చూసేయండి.
#BREAKING Gator Soup!
— Breaking HaHa! (@BreakingHaHa) July 22, 2022
కాగా, ఈ వీడియోను ‘Breaking Haha’ అనే ట్విట్టర్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇప్పటివరకు 5.94 లక్షల వ్యూస్ సాధించింది. అలాగే ఈ వీడియోకు 500కు పైగా లైకులు వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..