Viral Video: కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ! గాడిదను కాలితో తన్నాడు.. దెబ్బకు సీన్ రివర్సయింది..
కొన్నిసార్లు ఈ కర్మ సిద్దాంతం జరగడానికి 2 యుగాలు పట్టవచ్చు.. లేదా 2 గంటలు.. లేదా 2 మినిట్స్.. ఇలా చాలామందికి లేట్ అవొచ్చు..
నువ్వేదిస్తే నీకదే తిరిగొస్తుంది. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సిద్దాంతం. ప్రేమను పంచితే ప్రేమ.. ద్వేషాన్ని పంచితే.. ద్వేషం తిరిగొస్తుంది. నువ్వు ద్వేషాన్ని పంచితే నీకు అదే ద్వేషం తిరిగొస్తుంది.. దీన్ని చాలా మంది నమ్మరు. కొన్నిసార్లు ఈ కర్మ సిద్దాంతం జరగడానికి 2 యుగాలు పట్టవచ్చు.. లేదా 2 గంటలు.. లేదా 2 మినిట్స్.. ఇలా చాలామందికి లేట్ అవొచ్చు. ఈ వీడియో అందుకు నిదర్శనం. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఇక్కడొక వ్యక్తి.. ఓ గాడిదను కట్టేసి.. దాన్ని చేతులతో కొడుతూ.. కాళ్ళతో తన్నుతూ తెగ ఇబ్బంది పెట్టాడు. అయితే అతడికి ఆ కర్మఫలం జస్ట్ విత్ ఇన్ సెకండ్స్‌లో బూమరాంగ్‌లా చతుక్కున తిరిగొచ్చింది. తాను చేసిందేదో గొప్ప పని అన్నట్లుగా అతడు గాడిద ఎక్కి కూర్చున్నాడు. అదేమో అదును చూసుకుని అతడి కాలు కొరికేసింది. ఆ వ్యక్తి ఎంత ఏడ్చినా కాలు వదల్లేదు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. కాగా దీన్ని కేవలం ఓ వైరల్ వీడియో అని కొట్టిపారేయకండి. ఇది అందరికీ ఓ పాఠం. కచ్చితంగా నేర్చుకోవాలి.