నెట్టింట వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీరోజూ లక్షల్లో రకరకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక అందులో కొన్నింటికి వ్యూస్, లైకులు కోట్లలో వచ్చిపడతాయి. తాజాగా అలాంటి వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూశాక మీరు కూడా ‘అయ్యో.! పాపం..’ అని అనకమానరు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి ట్రాఫిక్‌లో దాదాపు రెండు గంటల పాటు కష్టపడి ఆఫీస్‌కు చేరుకున్నట్లు మీరు చూడవచ్చు. హమ్మయ్య.! అనుకుంటూ తన సీట్‌లో కూర్చుని బ్యాగ్ నుంచి ల్యాప్‌టాప్ చార్జర్ తీస్తుంది. ఆ తర్వాత ల్యాప్‌టాప్ కోసం వెతకగా.. లోపల చూసి దిమ్మతిరిగిపోతుంది. బ్యాగ్‌లో చార్జర్ పెట్టుకుంది గానీ.. ల్యాప్‌టాప్‌ను మాత్రం ఇంటి దగ్గరే మర్చిపోతుంది ఆ యువతి. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలిరా అనుకుంటూ బిత్తరపోయి.. తెల్లముఖం వేసింది.
ఇక ఈ ఫన్నీ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయ్. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘తాము చాలా బద్దకస్తులం.. అందుకే ల్యాప్‌టాప్ ఆఫీస్‌లోనే లాక్ వేసి పెట్టేస్తాం’ అని ఒకరు కామెంట్ పెడితే.. ‘ఈ విషయం తెలిస్తే.. రిజైన్ లెటర్ మెయిల్ పెట్టమంటాడని’ మరొకరు.. ‘హలో.! గూగుల్.. ల్యాప్‌టాప్ లేకుండా పని ఎలా చేయాలి’ అని ఇంకొకరు కామెంట్ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.