Viral Video: చిన్న మిస్టేక్‌తో క్షణాల్లో దగ్ధమైన బైక్.. వీడియో చూస్తే దిమ్మతిరిగే షాక్

పెట్రోల్ పంపులో చిన్న చిన్న తప్పులు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు మండే వస్తువులను తీసుకురావద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసేలా చూస్తారు. అయినా చాలామంది కస్టమర్స్ వాటిని చూస్తూ కూడా నిర్లక్ష్యంగా ఉంటారు.

Viral Video: చిన్న మిస్టేక్‌తో క్షణాల్లో దగ్ధమైన బైక్.. వీడియో చూస్తే దిమ్మతిరిగే షాక్
Viral News

Updated on: Apr 08, 2024 | 12:32 PM

పెట్రోల్ పంపులో చిన్న చిన్న తప్పులు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు మండే వస్తువులను తీసుకురావద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసేలా చూస్తారు. అయినా చాలామంది కస్టమర్స్ వాటిని చూస్తూ కూడా నిర్లక్ష్యంగా ఉంటారు.  అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కేవలం చిన్న తప్పు కారణంగా ఓ బైక్ మంటల్లో దగ్ధమైంది.  అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెట్రోల్ నింపుతున్నప్పుడు బైక్‌కు ఎలా మంటలు అంటుకుంటాయో చూడొచ్చు.

ఇద్దరు బైక్ రైడర్లు పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ నింపుతున్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి బైక్‌ని ముందుకు తీసుకెళ్లగానే పెట్రోల్‌ పైపు బైక్‌లో ఇరుక్కుపోయి పగిలిపోతుంది. ఆ వ్యక్తి బైక్‌పై నుంచి కిందకు దిగి పైపు సరిచేసే సమయంలోనే ఒక్కసారిగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ దృశ్యం చాలా భయానకంగా కనిపిస్తోంది. మంటలు చెలరేగగానే వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు.

ముందు కూర్చున్న వ్యక్తి మంటల బారిన పడుతున్నాడు. కొంత సమయం తరువాత మంటల్లో చిక్కుకున్న వ్యక్తి కూడా పరుగులు తీస్తాడు. pande15rohit అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి చనిపోవచ్చు అని కామెంట్ చేయగా.. దేవుడు ఎవరికీ అలాంటి స్నేహితులను ఇవ్వకూడదు అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. పెట్రోల్ బంకుల్లో బీ కేర్ ఫుల్.. ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి