
పాములంటే భయపడని వారు ఎవరుంటారు.! నిజజీవితంలోనే కాదు.. కలలోనూ పామును చూసి భయపడేవారు చాలామంది ఉన్నారు. పాములను దూరం నుంచి చూసినా.. అమాంతం ఆమడదూరం పరుగు పెడతారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కొంతమంది యువకులు ఓ సరస్సులో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారిని పలకరించిన ఓ అనుకోని అతిథి.. దెబ్బకు అందరినీ బెంబేలెత్తించేలా చేసింది.
వైరల్ వీడియో ప్రకారం.. అడవి సమీపంలోని ఓ సరస్సులో కొందరు యువకులు ఎంచక్కా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏమో.. ఓ పాము పొదల చాటు నుంచి ఒక్కసారిగా అక్కడే రాళ్లపై కూర్చున్న ఓ వ్యక్తి మీద దాడి చేసింది. దెబ్బకు అతడు పరుగులు పెట్టాడు. ఈ వైరల్ వీడియోను ‘elio_saldana’ అనే యూజర్.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. మిలియన్లకుపైగా వ్యూస్‌తో పాటు నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇది నిజంగానే జరిగిందా.? అసలు నమ్మలేకపోతున్నాను’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ‘ఆ యువకుడు చాలా అదృష్టవంతుడని’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..