అడవిలో జీవితం ఎప్పుడూ ప్రమాదాల వలయం. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు ఎలప్పుడూ మరో జంతువుపై ఆధారపడక తప్పదు. ముఖ్యంగా పులి, సింహం, చిరుత లాంటి జంతువులకు చిక్కితే.. క్షణాల్లో ప్రాణాలు పోయినట్లే. కానీ ఇక్కడ ఓ గేదె సింహాలకు చిక్కింది. కానీ చివరికి ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి.
సాధారణంగా అడవికి రాజైన సింహం వేట.. ఎప్పుడూ వన్ వేలోనే ఉంటుంది. చివరికి అదే గెలుస్తుంది. అయితే ఇక్కడ దానికి రివర్స్‌లో జరిగింది. తమలో తాము కొట్టుకుని.. ఎరగా దొరికిన అడవి గేదెను వదిలిపెట్టాయి సింహాలు. చివరికి ఆ సింహాల గుంపు తమలో తాము కొట్టుకుని.. గేదెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాయి. దీంతో ఆ గేదె బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జనవరి 21న షేర్ చేసిన దీనికి ఇప్పటివరకు 14.8 మిలియన్ల వ్యూస్, 1 లక్ష 41 వేల లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/lEt2pApFT3
— Weird and Terrifying (@weirdterrifying) January 21, 2023