జుగాద్ విషయంలో భారతీయులకు సాటి ఎవరూ లేరు అని అనేక విషయాల ద్వారా ప్రపంచానికి వెల్లడి అవుతూనే ఉంది. ఇప్పుడు జుగాద్ మాయాజాలం భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంకేతికత ఎక్కువగా ఉన్న వనరులను సేకరించే వ్యక్తులు కూడా ఉపయోగిస్తున్నారు. కొందరు తమ వల్ల కాని పని లేదంటూ సమర్థులుగా రుజువు చేసుకోవడానికి రకరకాల జుగాద్‌ను తయారు చేసి పనిని త్వరగా చేస్తారు. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలుగా రకరకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలకు బాగా నచ్చుతాయి కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రపంచం ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఇది చూస్తే ఖచ్చితంగా కలిసి ఉంటే కలదు సుఖం అని అనకమానరు ఎవరైనా..
ఇల్లు ఖాళీ చేసే సమయంలో ప్రజలు తమ సామానులను మరొక చోటకు చేర్చడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారన్న సంగతి అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్, సోఫా, బెడ్ వంటి బరువైన వస్తువులను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించడానికి ముగ్గురు నలుగురు వ్యక్తులు అవసరం, అప్పుడే ఈ వస్తువులను సురక్షితంగా వేరొక చోటకు తరలించవచ్చు. ఇలా చేయడానికి టీమ్ వర్క్ కూడా చాలా ముఖ్యం. అసలు టీమ్‌వర్క్ అంటే ఏమిటో చూడాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిచ్చెన కింద నిలబడి భారీ యంత్రాల భారాన్ని మోస్తున్న పురుషుల గుంపును మీరు చూడవచ్చు. ఈ సమయంలో వారి జట్టుకృషి, సమన్వయం అమోఘం ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా సరే మొత్తం తాము మోస్తున్న వస్తువు కింద పడిపోయేది. వీరు పడిన కష్టమంతా వృధా అయ్యి పోయేది. అయితే చాలా మంది ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ మంచి పద్ధతిలో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లారు.
ఈ వీడియో Instagramలో machines_in_action లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి లక్ష మందికి పైగా లైక్ చేసి, తమ తమ స్పందనలను రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..