Sachin Tendulkar: క్రికెట్ అంటే పరిచయమున్న ప్రతి ఒక్కరికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి 9 ఏళ్లు అవుతున్నా, ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో అభిమానించే, గౌరవించే క్రికెటర్లలో సచిన్ ఒకరు. అటువంటి సచిన్ తన క్రీడాజీవితంలో అనుభవాలను అప్పుడుప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. అలాంటి ఓ అనుభవాన్నే పంచుకుంటూ పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సచిన్ టెండుల్కర్ అండర్-15 స్థాయిలో ముంబై కోసం ఆడిన తన ఫస్ట్ మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ.. వీడియోను పోస్టు చేశారు. అప్పట్లో సుమారు 1986లో పూణెలోని పీవైసీ హిందూ జింఖానా మైదానంలో అండర్-15 అరంగ్రేటం మ్యాచ్ ను టెండుల్కర్ ఆడాడు. ఇటీవల ఆమైదానాన్ని సచిన్ సందర్శించాడు. ఆసందర్భంగా తన అండర్-15 ఫస్ట్ మ్యాచ్ అనుభవాలను పంచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో తన ప్రదర్శన, తాను ఏలా పెవిలియన్ చేరాడో వీడియోలో సచిన్ వివరించాడు. ఆ రోజు తాను కేవలం 4పరుగులే చేశానని చెప్పుకొచ్చాడు. పూణే PYC జింఖానాలో నాస్టాల్జిక్ క్షణాలు అనే క్యాప్షన్ తో ఈవీడియోను పోస్టు చేశాడు సచిన్ టెండుల్కర్.
తాను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నానని.. స్కూల్ నుంచి తన సహచారుడు రాహుల్ గన్ పూలే బ్యాటింగ్ చేస్తున్నాడని.. అతను ఆఫ్ డ్రైవ్ ఆడి.. మూడో పరుగు కోసం తనను టెంప్ట్ చేశాడని.. ఆసమయంలో నేను మూడో పరుగు కోసం సిద్ధంగా లేదని.. చివరికి తాను రనౌట్ అయ్యానని ఎలా పెవిలియన్ చేరాడో తెలిపాడు. ఆ మ్యాచ్ లో తాను 4పరుగులు మాత్రమే చేయగలిగానని చెప్పాడు సచిన్ టెండుల్కర్. ఆసమయంలో తాను ఎంతో కోపానికి గురయ్యాననిచ డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. తాను రనౌట్ అయ్యి పెవిలియన్ కి తిరిగి వచ్చేటప్పడు ఏడ్చిన క్షణాలు తనకు ఇప్పటికి గుర్తున్నాయని.. ఆమ్యాచ్ తన మొదటి మ్యాచ్ కావడంతో తాను నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఈవీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 35 ఏళ్లు గడిచినా అన్ని విషయాలు ఎంత బాగా గుర్తించుకున్నారో అంటూ సచిన్ ను అభినందనలతో ముంచెతుత్తున్నారు.
Nostalgic moment in Pune at PYC Gymkhana. pic.twitter.com/GYRBk6RBQk
— Sachin Tendulkar (@sachin_rt) August 17, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..