WATCH: శిక్షణ పేరుతో చితకబాదాడు.. జూనియర్లపై ఎన్‌సీసీ సీనియర్‌ విద్యార్థి అమానుషం..

|

Aug 04, 2023 | 8:20 AM

ఎన్‌సీసీ శిక్షణాపేరుతో జూనియర్‌ విద్యార్థులను సీనియర్‌ విద్యార్థి చితకబాదాడు. బురదలో వారిని పడుకోబెట్టి విచక్షణా రహితంగా ప్లాస్టిక్ పైపుతో కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థానేలోని బందోడ్కర్‌ కళాశాలలో ఎన్‌సీసీ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో ఓ సీనియర్‌ విద్యార్థి జూనియర్లకు శిక్షణ నేపంతో చితకబాదాడు. వారు తాను చెప్పినట్లుగా చేయలేదని కొట్టాడు. ఎన్‌సీసీ విద్యార్థులను దారుణంగా కొట్టిన వీడియో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలకలం రేపింది.

WATCH: శిక్షణ పేరుతో చితకబాదాడు.. జూనియర్లపై ఎన్‌సీసీ సీనియర్‌ విద్యార్థి అమానుషం..
Ncc
Follow us on

ట్రైనింగ్ పేరుతో చితకబాదాడు.. జూనియర్ విద్యార్థులపై తన ప్రతాపం చూపించాడు.. కసితో ఊగిపోయాడు.. సీనియర్లతో కలిసి జూనియర్లను ప్లాస్టిక్ పైప్‌తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టేశాడు. క్రమశిక్షణ పేరుతో తెగించాడు.. ఈ సీనియర్ ఎంతకాలంగా చేస్తున్నాడో తెలియదు కానీ.. ఈ తాజా వీడియో వైరల్ అవడంతో అసలు విషయం బయటపడింది. జూనియర్లపై సీనియర్ చేస్తున్న దాడి వెలుగులోకి వచ్చింది. ట్రైనర్‌నన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్లను ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ చితకబాదిన ఘటన థానేలోని బందోద్కర్ కాలేజీలో చోటుచేసుకుంది.

ఎన్‌సీసీ క్యాడెట్ ఓ యువకుడిని కొడుతున్న దృశ్యాన్ని ఓ కాలేజీ విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో బంధించగా.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైనింగ్ సమయంలో తాను చెప్పినట్టు చేయనందుకే జూనియర్లకు ఇలాంటి శిక్ష విధించాడని అంటున్నారు.

వీడియోలో ఏముంది..?

ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ తన 8 మంది జూనియర్‌లకు జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో పుష్-అప్ పొజిషన్ చేయమని ఆదేశించాడు. ఆపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడం మొదలు పెట్టాడు. జూనియర్ విద్యార్థులు బాధతో అరిచినా సీనియర్ వదలకుండా ప్లాస్టిక్ పైప్‌తో కొడుతుండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు..  శారీరకంగా హింసించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. శిక్షణ పేరుతో ఇలా చేయడం శిక్షార్హమని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

వీడియోలో ఘటన..

ఎన్‌సిసి శిక్షణపై..

జోషి బెడేకర్ కళాశాల ఆవరణలో బండోద్కర్, బేడేకర్, పాలిటెక్నిక్ ఇలా మూడు విభాగాల విద్యార్థులకు ఉమ్మడి ఎన్‌సిసి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు సైన్యం, నేవీ శిక్షణకు ముందు పాఠాలు చెబుతారు. ఈ శిక్షణ సమయంలో విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితే ఈ శిక్ష అత్యంత అమానవీయమని తేలడంతో కలకలం రేగింది. దీంతో విద్యార్థుల్లో ఎన్‌సీసీపై భయం ఏర్పడి ఎన్‌సీసీ వద్దు అని పలువురు అంటున్నారు. అయితే ఈ విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు.

ఇలాంటి ప్రవర్తనను సహించబోమని జోషి బేడేకర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ తెలిపారు. అదే సమయంలో ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే కమిటీ వేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగిన విద్యార్థులు భయపడకుండా వచ్చి మమ్మల్ని కలవాలని, ఎన్‌సిసిని వదిలిపెట్టే ఆలోచన కూడా చేయవద్దని నాయక్ అన్నారు. గత 40 ఏళ్లుగా తమ కాలేజీలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. అధ్యాపకులు గైర్హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు.

మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం