Viral Video : అమ్మబాబోయ్… పాములు ఇలాకూడా దాడి చేస్తాయా.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

| Edited By: Anil kumar poka

Sep 19, 2021 | 11:36 AM

Viral Video : మాములుగా మనం  దూరంగా పాము కనిపిస్తే... ఒక నెల రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లం.. అదే పాము ఎదురుపడితే...

Viral Video : అమ్మబాబోయ్... పాములు ఇలాకూడా దాడి చేస్తాయా.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..
Snake Attack
Follow us on

మాములుగా మనం  దూరంగా పాము కనిపిస్తే… ఒక నెల రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లం.. అదే పాము ఎదురుపడితే… వెనక్కి తిరగకుండా పరిగెడతాం.. అలాంటిది ఒక్కసారిగా మన మీద అటాక్ చేస్తే… ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ పొంచి ఉంటుందో చెప్పలేం. ఈ వీడియోలో వ్యక్తి పై పాము చేసిన దాడి చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా ఉంటాయి. నిత్యం రకరకాల వీడియాలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇంతకు అంతలా ఆవీడియోలో ఏముందంటే..

ఓ ఇంటి దగ్గర ఓ టేబుల్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ఎదో చేస్తున్న సమయంలో అక్కడే నక్కిన ఓ పాము ఒక్కసారిగా.. కోరలు చాచి అతడి పైకి దాడి చేసింది. పాము రావడం గమనించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా పరుగందుకున్నాడు. అయినా ఆపాము అతడి పైకి కసిగా బుసలు కొడుతూ వెళ్ళింది. ఇక వ్యక్తి దాన్ని చూసి బ్రతుకు జీవుడా అంటూ వెనక్కి తిరగకుండా పరిగెత్తాడు. దాంతో ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒళ్లు గగ్గురుపొడిచే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాముకు చిక్కి ఉంటే అతడి పని అంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :