Trending Video: ఎలక్షన్లలో గెలుపు కోసం ఎన్నో హామీలు ఇస్తారు. తీరా గెలిచాక ఆ హామీలు నెరవేర్చమంటే ఆగ్రహిస్తారు. అవసరమైతే దాడి కూడా చేస్తాం అన్నట్టుగా ఉంది కొంత మంది ప్రజా ప్రతినిధుల తీరు. రోడ్డు వేయమని అడిగినందుకు కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే యువకుడి చెంప చెల్లుమనిపించడం వివాదాస్పదంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక(Karnataka)తూముకూరు జిల్లా పావగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Pavagada Congress MLA )వెంకటరమణప్ప.. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. ఓ గ్రామంలోని యువకుడు.. ఎమ్మెల్యేను నిలదీశాడు. రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారు.. ఇంతకువరకు రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే యువకుడిపై చేయిచేసుకున్నారు. అంతేకాదు కాదు.. భూతులు తిడుతూ.. పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న ప్రజలు, అధికారులు అవాక్కయ్యారు .ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చాలా పెద్దాయన అని.. అందుకే తనను కొట్టినా వదిలేశానని, తనకేం భయం లేదని ఆ యువకుడు చెప్పాడు.
In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village.
After Siddaramaiah and DKS slapping Congress workers in public, this is a new low.
Reminds us of Amethi, where Rahul asked a young man demanding road to join the BJP. pic.twitter.com/XhYeldhZII
— Amit Malviya (@amitmalviya) April 21, 2022
Also Read: నిప్పులు చిమ్ముతున్న భానుడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలకు వాతావరణ శాఖ అలెర్ట్