తవ్వకాలు జరపుతున్నప్పుడు, పురాతన ఇళ్లు, భవనాలు కూల్చివేస్తున్నప్పుడు పురాతన నిధి, నిక్షేపాలు బయటపడిన ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. మాములుగా ఇలాంటి సమయాల్లో కూలీలు ఎక్కువమంది ఉంటారు కాబట్టి. వాటి పంపకాల్లో తేడా వచ్చి.. విషయం పోలీసులు, రెవిన్యూ అధికారుల వరకూ వెళ్తూ ఉంటుంది. అయితే ఇలా బయటపడిన నిధి రాచరిక కాలానికి చెందినవి అయితే మొత్తం.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకొంటుంది. ఒకవేళ ఆ నిధి ఎవరైనా పూర్వీకులదైతే.. ఆ కుటుంబానికి 1/5 వంతు వాటా ఇస్తారు. ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే.. కేసులు నమోదు చేస్తారు. తాజాగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా.. నిధి బయటపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. JCBతో.. కాంక్రీట్ స్లాబ్‌ను బయటకు తీస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. మెషిన్ ఆపరేటర్ స్లాబ్‌ను తీయడానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. JCB కొమ్ము… స్లాబ్‌ను కొంత వరకు బయటకు తీసిన తర్వాత, బంగారు వస్తువు వైపు బాణం గుర్తు చూపడాన్ని వీడియోలో చూడగలరు. అయితే అక్కడున్న ఆ బంగారపు వస్తువు ఏమిటో స్పష్టంగా తెలియలేదు. యంత్రంతో నిధిని వెలికితీసినట్లు క్యాప్టన్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. , అయితే వైరల్ వీడియో ఏ దేశానికి చెందినదో స్పష్టత లేదు. (Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.